టాలీవుడ్ క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ ,స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం పుష్ప-2. అభిమానులు ఎంతగానో ఎదురు చూసిన ట్రైలర్  నిన్నటి రోజున  చాలా గ్రాండ్ గా పాట్నాలో రిలీజ్ చేశారు. ట్రైలర్ అంచనాలను మించిపోయి మరి ఉన్నట్టుగా కనిపిస్తోంది. ఇప్పటి వరకు ప్రమోషన్స్ పరంగా కూడా పుష్ప-2 కంటెంట్ కూడా అద్భుతంగా ఉందనే విధంగా వార్తలయితే వినిపిస్తున్నాయి. ఇలాంటి సమయంలోనే పుష్ప-2 క్లైమాక్స్ కు సంబంధించి ఒక న్యూస్ అయితే ఇండస్ట్రీలో వినిపిస్తోంది. క్లైమాక్స్ ఎవరు ఊహించని విధంగా ఉండబోతుందని యాక్షన్స్ సన్నివేశాలు అభిమానులకు , ప్రేక్షకులకు సైతం వెన్నులో వణుకు పుట్టించే విధంగా ఉంటుందట. అల్లు అర్జున్ రాకింగ్ యాక్టింగ్ తో మెస్మరైజ్ చేస్తారని టాక్ వినిపిస్తోంది.


ట్రైలర్ లో చూపించిన వాటికంటే సినిమాలో మరింత ఆసక్తికరంగా కనపరిచే సన్నివేశాలు చాలానే ఉంటాయని టాక్  వినిపిస్తోంది. రష్మిక హీరోయిన్గా ఇందులో నటిస్తోంది. movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ వారు కూడా ఈ సినిమాని భారీ బడ్జెట్ తోనే తెరకెక్కించడమే కాకుండా ప్రమోషన్స్ ని కూడా భారీగానే చేస్తున్నట్లు కనిపిస్తోంది. ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా పుష్ప-2 మానియా పేరు ఎక్కువగా వినిపిస్తోంది. దేవి శ్రీ ప్రసాద్ అందించిన మ్యూజిక్ తో పాటు పాటలు కూడా అద్భుతంగా ఆకట్టుకుంటున్నాయి.



మొత్తానికి పుష్ప-2 చిత్రానికి సంబంధించిన టికెట్లు బుకింగ్ విషయంలో కూడా అభిమానులు చాలా ఎక్సైటింగ్ గా ఉన్నారు. ఇప్పటికీ ఈ సినిమా టికెట్ల విషయంలో భారీగానే ధరలు పలికే విధంగా ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అల్లు అర్జున్ కూడా పుష్ప-2 సినిమా కోసం చాలా కష్టపడ్డట్టుగా ట్రైలర్లో అయితే కనిపించింది. అలాగే ఇందులో మరి కొత్త క్యారెక్టర్లు కూడా ఎంట్రీ ఇవ్వబోతున్నాయట. డిసెంబర్ 5న పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ కాబోతున్న పుష్ప-2 సినిమా ఏ విధంగా ఉంటుందో చూడాలి..

మరింత సమాచారం తెలుసుకోండి: