అయితే దీనిపై ఇప్పటివరకు అఫీషియల్ ప్రకటన మాత్రం రాలేదు. మనకు తెలిసిందే నయనతార తన వెడ్డింగ్ డాక్యుమెంటరీలో భాగంగా నెట్ ఫ్లిక్స్ తో మింగిల్ అయింది . ఈ క్రమంలోనే తన వెడ్డింగ్ డాక్యుమెంటరీలో ధనుష్ నిర్మాణం లో తెరకెక్కిన ఓ సినిమాకి సంబంధించిన మూడు సెకండ్ల క్లిప్ ను యాడ్ చేసింది. దీనితో ధనుష్ ఆమెకు లీగల్ నోటీసులు పంపిస్తూ ఏకంగా 10 కోట్ల నష్టపరిహారం డిమాండ్ చేశారు . దీన్ని ఓపెన్ గా నయనతార సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ధనుష్ ని మర్యాదపూర్వకంగానే హెచ్చరించి మరి ఆయన పేరుని సోషల్ మీడియాలో ఎలా ట్రోలింగ్ కి గురైయేలా చేసింది .
ఈ రాద్ధాంతామంతా గత రెండు రోజుల నుంచి సోషల్ మీడియాలో మనం చూస్తూనే ఉన్నాం. అయితే రజనీకాంత్ మ్యాటర్లో ఇవ్వాల్వ్ అయినట్టు తెలుస్తుంది. రజినీకాంత్ - నయనతార కు చాలా చాలా క్లోజ్ ఆ కారణంగానే నయనతార -ధనుష్ లను కూర్చోబెట్టి ప్రాబ్లం సాల్వ్ చేసే విధంగా మాట్లాడుతున్నాడట రజనీకాంత్. అంతేకాదు నయనతార ఓపెన్ గానే ఆయన క్షమాపణలు చెబుతున్న విధంగా ఒక పోస్ట్ పెట్టాలి అంటూ రజనీకాంత్ మాట్లాడుతున్నారట . ఒకవేళ ఇదే జరిగితే మాత్రం నిజంగా నయనతారకు పరువు పోయినంత పని అవుతుంది. అయితే నయనతార ఆయనకు క్షమాపణలు చెప్పడానికి ఒప్పుకుంటుందా..? అనేది ప్రశ్నార్థకంగా ఉంది . చూద్దాం మరి రజనీకాంత్ ప్రయత్నాలు ఎంత వరకు సక్సెస్ అవుతాయో..?