ప్రముఖ భారతీయ భాషలతో పాటు బెంగాలీ భాషలో సైతం ఈ సినిమా రిలీజ్ కానుంది. ఈ సినిమా శాటిలైట్ రైట్స్ స్టార్ మా సొంతం కాగా ఓటీటీ రైట్స్ నెట్ ఫ్లిక్స్ సొంతమయ్యాయి. ఈ సినిమా ట్రైలర్ ఏనుగు ఘీంకారంతో మొదలైంది. పుష్పరాజ్ ను మదపుటేనుగుతో పోలుస్తూ ఏనుగు ఘీంకారాన్ని రెఫరెన్స్ గా పెట్టారని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. ఈ సినిమాలో జగపతిబాబు కోగటం వీరప్రతాప్ రెడ్డి రోల్ లో కనిపించనున్నారు.
పుష్ప పాత్ర ఎలా ఉండబోతుందో అతని రోల్ ద్వారా ప్రేక్షకులకు పూర్తిస్థాయిలో అర్థం కానుంది. బన్నీ కనపడే ప్రతి సీన్ హై లెవెల్ లో ఉండేలా మేకర్స్ ప్లాన్ చేశారు. పుష్పరాజ్ అంచెలంచెలుగా హెలికాఫ్టర్ వాడే స్థాయికి ఎదగడం ట్రైలర్ లో గమనించవచ్చు. ఎవరి మాట వినని పుష్పరాజ్ భార్య మాట మాత్రం వింటాడని ట్రైలర్ తో క్లారిటీ వచ్చేసింది. భన్వర్ సింగ్ షెకావత్ రోల్ క్రూరంగా ఉంటుందని ట్రైలర్ తో అర్థమవుతోంది.
డబ్బుల కోసం ఎంత దూరమైనా వెళ్లే మనస్తత్వం ఉన్న పాత్రలో పుష్పరాజ్ కనిపించనున్నారు. ట్రైలర్ లో తారక్ పొన్నప్ప మెడలో చెప్పుల దండతో కనిపిస్తాడు. భన్వర్ సింగ్ షెకావత్ డ్యాన్స్ వేస్తున్న వీడియో సైతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పుష్ప ది రూల్ మూవీ 2000 కోట్ల రూపాయల కలెక్షన్లను సాధిస్తుందని కామెంట్లు వినిపిస్తున్నాయి. శ్రీవల్లి రోల్ సినిమాలో చనిపోతుందని భోగట్టా.