ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోదరుడైన రామ్మూర్తి నాయుడు అంత్యక్రియలు నిన్నటి రోజున తమ సొంత ఊరిలో ప్రభుత్వ లాంఛనాలతో ముగిసాయి. రామ్మూర్తి నాయుడు మృతి పట్ల పలువురు టిడిపి నేతలు కూడా సంతాపాన్ని తెలియజేశారు. దాదాపుగా అందరూ కూడా హైదరాబాదులో పార్థివదేహానికి నివాళులు అర్పించడానికి వచ్చారు. అయితే జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ మాత్రం అసలు రామ్మూర్తి నాయుడు మృతి పట్ల కనీసం సంతాపం కూడా తెలియజేయలేదు. దీంతో ఇప్పుడు ఏపీ అంతా కూడా చర్చనీ అంశంగా మారిందట.


గత కొన్నేళ్లుగా జూనియర్ ఎన్టీఆర్ , నారా కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు ఉన్నాయని అందుకే దూరంగా ఉంటున్నారని వార్తలు కూడా వినిపిస్తూ ఉండేవి.. ముఖ్యంగా రాజకీయంగా కూడా ఎన్టీఆర్ అసలు అన్నిటిని దూరం పెట్టేసారని సమాచారం. 2024 ఎన్నికల ముందు కూడా ఎన్టీఆర్ టిడిపి తరఫున ప్రచారం చేయలేదని చాలామంది విమర్శించడం జరిగింది.కేవలం ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ మాత్రమే ఎలాంటి పని నైనా  చేసుకుంటూ ఒకే దారిలో వెళుతూ ఉన్నారు. అయితే చంద్రబాబు నాయుడు సోదరుడు రామ్మూర్తి నాయుడు మృతి పట్ల ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ సంతాపాన్ని తెలియచేయకపోవడంతో చాలా మంది నేతలు గుర్రుగా ఉన్నారు. అంతేకాకుండా అంత్యక్రియలకు కూడా ఎవరు హాజరు కాకపోవడంతో నారా కుటుంబం, నందమూరి బ్రదర్స్ మధ్య విభేదాలు ఉన్నాయని మరింత బలాన్ని చేకూర్చింది.


మరి ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు కానీ మొత్తానికి ఇప్పుడు ఏపీ అంతా కూడా ఈ విషయం హాట్ టాపిక్ గా మారుతున్నది. గతంలో కూడా చాలామంది టిడిపి నేతలు ఎన్టీఆర్ ని సైతం విమర్శించారు. ఎన్టీఆర్ మాత్రం ఇలాంటి విషయాలు ఏవి పట్టించుకోకుండా కేవలం తన పని తాను చేసుకుంటూ వెళుతూ ఉన్నారు. రామ్మూర్తి నాయుడు కుమారుడు ఎవరో కాదు నారా రోహిత్.. ఇటీవలే నారా రోహిత్ ఎంగేజ్మెంట్ కూడా చాలా గ్రాండ్ గా జరిగింది.

మరింత సమాచారం తెలుసుకోండి: