సినీ ఇండస్ట్రీలో సీనియర్ నటుడిగా గుర్తింపు పొందిన కృష్ణంరాజు సెప్టెంబర్ 22, 2022న ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయారు. పోస్ట్ కోవిడ్ సమస్య రావడంతో గతంలో హైదరాబాద్ లోని ఆసుపత్రిలో కృష్ణంరాజు చికిత్స తీసుకున్నారు. అప్పటికే రెండుసార్లు పోస్ట్ కోవిడ్ సమస్యలతో చాలా ఇబ్బంది పడ్డాడు. కోవిడ్ కారణంగా అత్యంత విషమంగా మారిన కృష్ణంరాజు గుండెపోటుతో తుది శ్వాస విడిచినట్లు వైద్యులు వెల్లడించారు. సినీ నటుడిగా రెబల్ స్టార్ కృష్ణంరాజు ఆరు దశాబ్దాల పాటు తన సేవలను అందించారు.

రాజకీయ రంగంలోనూ తనదైన ముద్రను వేసుకొని క్రియాశీలకంగా వ్యవహరించారు. కృష్ణంరాజుకు ముగ్గురు అమ్మాయిలు ఉన్న సంగతి తెలిసిందే. అయినప్పటికీ ఆయన సోదరుడి కుమారుడైన ప్రభాస్ ను సినీ పరిశ్రమకు పరిచయం చేశాడు. కృష్ణంరాజు వారసత్వాన్ని అందిపుచ్చుకొని యంగ్ రెబల్ స్టార్ గా పరిచయమైన ప్రభాస్ ఇప్పుడు ఏకంగా పాన్ ఇండియా స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు.


ప్రభాస్ విజయం వెనుక కృష్ణంరాజు కృషి ఎంతగానో ఉంది. ప్రభాస్ ను కృష్ణంరాజు సొంత కొడుకు కన్నా ఎక్కువగా చూసుకునేవారు. ప్రభాస్ సక్సెస్ చూసి కృష్ణంరాజు ఎంతో సంతోషపడేవాడు. కానీ ఒకే ఒక విషయంలో కృష్ణంరాజుకు చాలా బాధ ఉండేది. ప్రభాస్ వివాహం చేసుకుంటే చూడాలని, తన పిల్లలతో ఆడుకోవాలని ఉందని ఒక సందర్భంలో కృష్ణంరాజు వెల్లడించాడు. చివరికి ప్రభాస్ వివాహం చూడకుండానే కృష్ణంరాజు కన్నుమూశారు.


కృష్ణంరాజు మరణ వార్త విని ప్రభాస్ చాలా బాధపడ్డాడు. అతని అంత్యక్రియలను ఏపీలోని మొగల్తూరులో ప్రభాస్ దగ్గరుండి నిర్వహించాడు. కృష్ణంరాజు పేరు మీద వారి అభిమానులకు భోజనం కార్యక్రమాలను ప్రభాస్ ఏర్పాటు చేశారు. ఇక తన చెల్లెలకు, పెద్దమ్మకు ఎలాంటి కష్టం రాకుండా దగ్గరుండి ప్రభాస్ చూసుకుంటున్నాడు. తన పెద్దనాన్న లేడనే లోటు ప్రభాస్ కి ఇప్పటికీ అలానే ఉండిపోయింది. ఎలాంటి ఇంటర్వ్యూలకు, ఫంక్షన్లకు వెళ్లిన కృష్ణంరాజు పేరును తలుచుకోకుండా అస్సలు ఉండలేడు.

మరింత సమాచారం తెలుసుకోండి: