రష్మిక మందన్నా ఎలాంటి సీన్స్ అయినా చేస్తుంది అన్న విషయం అందరికీ తెలుసు . కాగా రీసెంట్గా రిలీజ్ అయిన  పుష్ప 2 ట్రైలర్ లో కూడా ఆమె పర్ఫామెన్స్ బాగా  ఇరగదీసింది.  కనిపించిన  మూడు నాలుగు సీన్స్ లో కూడా లుక్స్ పరంగా హైలెట్గా మారింది.  మరీ ముఖ్యంగా పుష్పరాజ్  గాడి భార్య శ్రీవల్లి ఎలా ఉండాలి అని జనాలు భావించారో.. అలాగే యాప్ట్ గా సెట్ అయింది.  ఈ సినిమాతో రష్మిక మందన్నా మరొక క్రేజీ హిట్ ని తన ఖాతాలో వేసుకోవడం పక్కా అంటున్నారు రష్మిక అభిమానులు .


అయితే పుష్ప2 ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత రష్మికకు సంబంధించిన కొన్ని వార్తలు బాగా వైరల్ అవుతున్నాయి. మరి ముఖ్యంగా రష్మిక మందన్నా ఈ సినిమాలో చాలా ప్రాణం పెట్టి నటించింది.  అయితే ఒక సీన్ చేయమంటే మాత్రం సుకుమార్ కి అస్సలు చేయను అంటూ తెగేసి చెప్పిందట . ఈ సినిమాలో పుష్ప రాజ్  మితిమీరిన వైలెన్స్ ని ఎంకరేజ్ చేస్తున్న మూమెంట్లో శ్రీవల్లి "ఇంతగా తెగించేస్తే నా పసుపు కుంకాలకి గ్యారెంటీ ఉండదు "అన్న రేంజ్ లో పుష్పరాజ్ పై కోప్పడుతుందట . ఒకానొక మూమెంట్లో ఫుల్ ఫైర్ అయిపోతూ పుష్పరాజ్ ని .. శ్రీవల్లి  తన కాళ్లకున్న చెప్పుతో కొట్టే విధంగా సీన్ రాశారట సుకుమార్ .



అయితే "శ్రీవల్లి మాత్రం ఆ సీన్ నేను చేయను అంటూ తెగేసి చెప్పిందట . అంత పెద్ద పాన్  ఇండియా హీరోని అలాంటి సీన్ లో చూపిస్తే మీకు ట్రోలింగ్ జరుగుతుందో లేదో ..నన్నయితే అసలు హీరోయిన్గా ఎదగనివ్వరు నావల్ల కాదు బాబు.. నేను చేయలేను" అంటూ సుకుమార్ కి ఓపెన్ గానే చెప్పేసిందిట . ఆ తర్వాత ఆ సీన్ ని సుకుమార్ సినిమా నుంచి లేపేసారట.  శ్రీవల్లి క్యారెక్టర్ లో లీనమై పోయినటించిన రష్మిక ఆలోచించింది నిజమే . ఒకవేళ నిజంగానే రష్మిక ఈ సీన్ లో నటించి ఉంటే మాత్రం నో డౌట్ పుష్ప2 సినిమా తర్వాత ఆమెకి ఇండస్ట్రీలో కెరియర్ లేకుండా చేసి ఉండే వాళ్ళు బన్నీ అభిమానులు . ఈ విషయాన్ని బాగా ముందు గానే కనిపెట్టేసింది రష్మిక . ఆ కారణం చేతన ఈ సీన్ లో నటించలేను అంటూ తెగేసి చెప్పేసింది అన్న వార్తలు ఎక్కువగా వినిపిస్తున్నాయి..!

మరింత సమాచారం తెలుసుకోండి: