లేడీ కొరియోగ్రాఫర్ పై జానీ మాస్టర్ లైంగిక వేధింపుల ఆరోపణ కేసులో ఎన్నో అబియోగాలు ఎదుర్కొంటూ ఉన్నారు. ఈ కేసులో అరెస్టు అయిన జానీ మాస్టర్ 37 రోజుల తర్వాత జైలు నుంచి బయటికి రావడం జరిగింది. ఆ తర్వాత కోర్టు బెయిల్ ఇవ్వడంతో బయటికి వచ్చి ఎక్కువగా తన కుటుంబ సభ్యులతోనే తన జీవితాన్ని గడుపుతూ ఉన్నారు. ఆ తర్వాత బయటకు కూడా ఎక్కడ ఎలాంటి కార్యక్రమాలలో జానీ మాస్టర్ కనిపించడం లేదు. అయితే చాలా రోజుల తర్వాత ఇప్పుడు ఒక సినిమా ఈవెంట్ లో కనిపించారు జానీ మాస్టర్.


జబర్దస్త్ లో పాపులారిటీ సంపాదించుకున్న రాకింగ్ రాకేష్ హీరోగా నటించిన కెసిఆర్ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ గా హాజరయ్యారు. అక్కడ మాజీ మంత్రి రోజాతో పాటు  తదితర సినీ ప్రముఖులు కూడా సందడి చేయడం జరిగింది. జానీ మాస్టర్ మొదటిసారి ఇలా మాట్లాడుతూ.. తనకు కష్టకాలంలో అండగా నిలిచినటువంటి కుటుంబంతో పాటు అభిమానులకు ప్రత్యేకమైన ధన్యవాదాలు అంటూ తెలియజేశారు. తనకు అండగా ఉన్నటువంటి అందరికీ రుణపడి ఉంటారని తెలియజేశారు జానీ మాస్టర్.. ఈ కష్టకాలంలో తనని నమ్మిన ప్రతి ఒక్కరికి కూడా థాంక్స్ అంటూ తెలిపారు.



ఇలాంటి టఫ్ సిచువేషన్ లో ఎవరు కనిపించరు.. కానీ నన్ను నమ్మి మీ ఇంటి బిడ్డగా నన్ను ఆశీర్వదించారు ఆ నమ్మకం అలాగే ఉంటుంది త్వరలోనే అన్ని విషయాలు తెలుస్తాయి అంటూ తెలిపారు. జబర్దస్త్ రాకేష్ చాలా మంచి వ్యక్తి అని తాను జబర్దస్త్ షో కి వెళ్ళినప్పుడు కూడా అతనిని చాలా దగ్గరుండి నేను గమనించాను చాలా కష్టపడి పైకి వచ్చారని ఎవరి గురించి ఎక్కువగా నెగిటివ్ మాట్లాడాలని.. ప్రస్తుతం ఉన్న వైబ్ చూస్తూ ఉంటే కేసీఆర్ సినిమా ఖచ్చితంగా విజయాన్ని అందుకుంటుందని నమ్ముతున్నారని తెలిపారు జానీ మాస్టర్. మొత్తానికి తను నిర్దోషిగా బయటకి వస్తానని తెలియజేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: