రీసెంట్ గా సోషల్ మీడియాలో సుమ కొడుకు రోషన్ కి సంబంధించిన కొన్ని వార్తలు బాగా వైరల్ అవుతున్నాయి . సుమ కొడుకు బబుల్ గమ్ అనే సినిమా ద్వారా తెలుగు చలనచిత్ర పరిశ్రమలోకి హీరోగా ఎంట్రీ ఇచ్చిన విషయం మనందరికీ బాగా తెలుసు . ఈ సినిమా తో చించేస్తాడు పొడిచేస్తాడూ అంటూ అంతా భావించారు. కానీ ఈ సినిమా ఫ్లాప్ అయింది . మొదటి సినిమాతోనే టూ రొమాంటిక్ సీన్స్ లో నటించడంతో రోషన్ పై పల రకాల నిందలు కూడా పడ్డాయి . కొందరు బూతులు కూడా తిట్టారు.
అయితే ఇప్పుడు రోషన్ పేరు సోషల్ మీడియాలో మారుమ్రోగిపోతుంది . దానికి కారణం ఆయన ప్రేమించిన అమ్మాయి అంటూ ప్రచారం జరుగుతుంది . రోషన్ తన స్కూల్ ఫ్రెండ్ అయినా ఒక అమ్మాయిని ఎప్పటి నుంచో ప్రేమిస్తూ వస్తున్నాడట. ఇప్పుడు ఆ అమ్మాయికి ఇంట్లో వాళ్ళు పెళ్లి చేసే వరకు వెళ్లిపోయిందట. అయితే ఇన్నాళ్లు ఆ అమ్మాయి రోషన్ ని ప్రేమిస్తున్నాను అంటూ పెళ్లి చేసుకోవాలి అంటూ డిసైడ్ అయిన రోషన్ కి ఎటువంటి జాబ్ అదే విధంగా సినిమా ఇండస్ట్రీలో వాల్యూ లేకపోవడంతో ఆ కుటుంబ సభ్యులు ఆ ఇంటికి ఇవ్వడానికి ఒప్పుకోవడంలేదట. తమ కూతురిని ఆ ఇంటి కోడలు చేయడానికి .. పంపించడానికి అంగీకరించడం లేదట . అంతేకాదు ఆల్రెడీ సుమ కొడుకు ఆ అమ్మాయి ఒకసారి ఇంట్లో నుంచి పారిపోయారు అన్న ప్రచారం కూడా అప్పట్లో జరిగింది. దీంతో సోషల్ మీడియాలో ఇదే వార్త ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతూ సుమ కొడుకు రోషన్ కనకాల పేర్లు మారుమ్రోగిపోయేలా చేస్తుంది..!