సూర్య నటించిన కంగువ సినిమా కూడా సీక్వెల్ ఉంటుందని ప్రకటించారు. కంగువ మిక్స్డ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ సీక్వెల్ తీయడానికి కొంత సమయాన్ని నిర్మాతలు తీసుకుంటున్నట్లు సమాచారం. ఇక డైరెక్టర్ శంకర్ , కమలహాసన్ నటించిన భారతీయుడు సినిమా 1996లో విడుదలై మంచి విజయాన్ని అందుకున్నది. దాదాపుగా 28 ఏళ్ల తర్వాత భారతీయుడు-2 రిలీజ్ చేశారు. అలాగే భారతీయుడు-3 సినిమాను కూడా షూటింగ్ తీసినట్లు తెలుస్తోంది. దీంతో రెండవ భాగం ఫ్లాప్ కావడంతో మూడో భాగం విడుదల చేయడం సందిగ్ధంగా మారింది. అంతేకాకుండా దీనిని ఓటీటిలో రిలీజ్ చేయబోతున్నట్లు ప్రచారమైతే వినిపిస్తోంది.
అయితే తాజాగా ఓటీటీలో రిలీజ్ చేయడానికి డైరెక్టర్ శంకర్ గాని అటు కమలహాసన్ కానీ ఒప్పుకోవడం లేదట.. భారతీయుడు-2 లాగా పార్ట్ -3 కూడా ఉండకూడదని భావిస్తున్నారట. ఈ చిత్రంలోని కొన్ని సన్నివేశాలు రీషూట్ చేయడానికి కమలహాసన్ డైరెక్టర్ శంకర్ కు సలహా ఇచ్చినట్లు సమాచారం. శంకర్ కూడా అందుకు సిద్ధమైనట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇందుకోసం నిర్మాణ సంస్థ లైకాకు మరో రూ .100 కోట్ల రూపాయలు బడ్జెట్ సమకూర్చినట్లు వార్తలయితే వినిపిస్తున్నాయి. మళ్లీ రీషూట్ కి రూ .100 కోట్ల రూపాయలు అని తెలియడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు. ప్రస్తుతం రామ్ చరణ్ తో గేమ్ ఛేంజర్ చిత్రాన్ని తెరకెక్కించగా.. వచ్చే యేడాది జనవరిలో రిలీజ్ చేయబోతున్నారు. ఇప్పుడు రామ్ చరణ్ అభిమానులు ఈ సినిమా విషయం పైన కాస్త ఆందోళన చెందుతున్నారని చెప్పవచ్చు.