•తల్లి మరణంతో సగం చచ్చిపోయాను అన్న రాజీవ్ కనకాల

•తల్లితో పాటు తండ్రి, చెల్లి కూడా దూరం అయ్యారు..

•కుటుంబ సభ్యుల మరణంతో ఇప్పటికీ తేరుకోలేకపోతున్న రాజీవ్ కనకాల..


తెలుగు సినీ పరిశ్రమలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, విలన్ గా కూడా మంచి పాపులారిటీ సంపాదించుకున్న నటుడు రాజీవ్ కనకాల గురించి చెప్పాల్సిన పనిలేదు. యాంకర్ సుమ భర్తగా కూడా భారీ పాపులారిటీ అందుకున్నారు రాజీవ్ కనకాల. ఇక రాజీవ్ కనకాల తండ్రి దేవదాస్ కనకాల కూడా ఎన్నో చిత్రాలలో నటించారు. అయితే  రాజీవ్ కనకాల తండ్రి మరణం , తల్లి, చెల్లి కూడా మరణాలు వరుసగా జరగడంతో  తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు రాజీవ్ కనకాల. ఈ విషయాల పైన ఒక ఇంటర్వ్యూలో గతంలో మాట్లాడారు.వాటి గురించి చూద్దాం.


రాజీవ్ కనకాల మాట్లాడుతూ.. తన తండ్రికి ఒక డ్రీమ్ ఉన్నదని.. అదేమిటంటే తనని డైరెక్టర్గా చూడాలని.. అందుకోసం తాను ఒక పైలెట్ ఎపిసోడ్ ను చేశానని.. ఈ ఎపిసోడ్ ని దూరదర్శన్ లో అప్పట్లో వచ్చేదని తెలిపారు. ఇక తన తండ్రి మరణం పైన రాజీవ్ కనకాల మాట్లాడుతూ.. 2018లో నా  తల్లి మరణించింది. ఆ తర్వాత ఏడాదిన్నరకే  తండ్రి కూడా మరణించారు అంటూ తెలియజేశారు.. తన తండ్రి సోఫాలో కూర్చొని కింద పడడంతో తలకు గాయం అయ్యిందని , అయితే వెంటనే హాస్పిటల్ లో  జాయిన్ చేసి, బెటర్ ట్రీట్మెంట్ ఇప్పించినా కూడా  ప్రయోజనం లేదని తెలియజేశారు.

చివరికి అనారోగ్య కారణం చేత ఆగస్టు రెండవ తేదీన 2019లో కన్నుమూశారు. ముఖ్యంగా తన తండ్రికి ఎవరితో కూడా సేవలు చేయించుకోవడం ఇష్టం లేదని ఎమోషనల్ గా మాట్లాడారు రాజీవ్ కనకాల. ఇక తర్వాత తన చెల్లెలు మరణం కూడా జరిగిందని.. తన చెల్లెలికి చాలా రోజుల నుంచి క్యాన్సర్ ఉండేదని.. అయితే ఈ విషయాన్ని ఆమె ఎవరికీ చెప్పలేదు. చివరికి అది తెలుసుకునే సమయానికి ఫోర్త్ స్టేజ్ కి వెళ్ళిపోయిందని తెలిపారు. వైద్యుల దగ్గర ఎంత చూపించినా కూడా చివరికి కన్నుమూసింది అని తెలిపారు రాజీవ్ కనకాల.. ఇలా వరుసగా విషాదాలు చోటు చేసుకోవడంతో ఒక వారం రోజులపాటు అసలు తనకి నిదురే వచ్చేది కాదని తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: