పాపం అసలు ఇన్వాల్వ్ అవ్వకపోయినా సరే మన తెలుగు హీరోని దారుణాతి దారుణంగా ట్రోల్ చేసేస్తున్నారు జనాలు.  ధనుష్ - నయన తారల్ మధ్య వార్  ఎంత పిక్స్ కి చేరుకుందో మనకు బాగా తెలుసు.  కేవలం మూడు సెకండ్ల వీడియో వాడుకున్నందుకు గాను ధనుష్ 10 కోట్ల నష్టపరిహారం డిమాండ్ చేయడం చాలా విడ్డూరంగా ఉంది అని.. అది కూడా వేల కోట్ల ఆస్తి ఉన్న ఒక స్టార్ హీరో.. మరొక స్టార్ హీరోయిన్ పై ఇలాంటి ఒక పరువు నష్టం పరిహారం కోరడం చాలా చాలా విచిత్రంగా ఉంది అని జనాలు మాట్లాడుకుంటున్నారు . అయితే చాలామంది ధనుష్ అలాగే నయనతారల మధ్య గొడవలు సర్దు పరచడానికి ట్రై చేస్తున్నారట .


కానీ ఎవరికి వాలు తమ వర్షెన్ ని వినిపిస్తున్నారు తప్పిస్తే ఎక్కడ కూల్ అయ్యే విధంగా ఎవరూ మాట్లాడుకోవడం లేదట.  రీసెంట్గా సోషల్ మీడియాలో వీళ్ళిద్దరి మేటర్ లో ఒక తెలుగు హీరో ఇబ్బందులకు గురవుతున్నాడు అన్న ప్రచారం ఎక్కువగా జరుగుతుంది. ఆయన మరెవరో కాదు "నాగార్జున".  నయనతార అంటే అక్కినేని నాగార్జునకు ఎంత ఇష్టం అనే విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు . అఫ్కోర్స్ మన తెలుగు సినిమా ఇండస్ట్రీలో నయనతార చాలామంది హీరోలతో వర్క్ చేసింది.  కానీ , అందరికంటే ఫేవరెట్ మాత్రం ఆమెకి బాలకృష్ణ అదే విధంగా నాగార్జున అని చెప్పుకొచ్చింది.

 

అయితే రీసెంట్ గా ఆమె వెడ్డింగ్ డాక్యుమెంటరీ వీడియోలో నాగార్జున సైతం ఆమెకు సంబంధించి ఎన్నో విషయాలను షేర్ చేసుకున్నాడు . అయితే ఇప్పుడు ధనుష్ తో నాగార్జున కుబేర అనే సినిమాలో నటిస్తున్నాడు . వీళ్ళిద్దరి మధ్య వార్ మొదలైంది . ఇప్పుడు నయనతారని సపోర్ట్ చేస్తే ధనుష్ కి కోపం .. ధనుష్ పక్కన మాట్లాడితే నయనతారకి ఇబ్బంది ..ఏం చేయాలో అర్థం కాని అయోమయ సిచువేషన్ లో ఉన్నాడు అక్కినేని నాగార్జున . అయితే నాగార్జునకి ఇలాంటి మ్యాటర్స్ డీల్ చేయడం పెద్దకొత్తెం కాదు . ఎవరికి వత్తాసు పలకకుండా సైలెంట్ గా తన పని తాను చూసుకో పోతాడు.  తన షూటింగ్ను తను కంప్లీట్ చేసుకుంటాడు . ఇలాంటివి ఎన్నో దాటుకొని వెళ్తేనే నాగార్జున ఇంత పెద్ద హీరో అయ్యాడు.. అంటూ జనాలు మాట్లాడుకుంటున్నారు..!

మరింత సమాచారం తెలుసుకోండి: