- తల్లిని కోల్పోయినందుకు గుక్కపెట్టి ఏడ్చిన నరేష్..
దివంగత నటి విజయ నిర్మల మరణం చాలా బాధాకరం.. ఆమె మరణించిన సమయంలో కొడుకు నరేష్ ఎంతలా కృంగిపోయారో చెప్పనక్కర్లేదు.తల్లి మరణాన్ని తలుచుకొని వెక్కివెక్కి ఏడ్చారు.. వేలకోట్ల ఆస్తులు సంపాదించి పెట్టిన విజయనిర్మల మరణం నరేష్ ని కలిచివేసింది.మరి తల్లి మరణం నరేష్ ని ఎలా బాధ పెట్టిందో ఇప్పుడు చూద్దాం.
విజయనిర్మల మరణం:
1946 ఫిబ్రవరి 20న పుట్టిన విజయనిర్మల చిన్నప్పటినుండే సినిమాల మీద ఆసక్తితో పెరిగింది. అలా బాలనాటిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి మొదటిసారి రంగులరాట్నం సినిమాతో హీరోయిన్గా మారిపోయింది. అయితే విజయ నిర్మలకి సినిమాల మీద పిచ్చి ఎక్కువగా ఉండడంతో మొదటి భర్తతో ఎక్కువగా గొడవలు జరిగేవట.అలా మొదట కృష్ణమూర్తిని పెళ్లి చేసుకున్న విజయనిర్మల పిల్లలు పుట్టాక ఆయనతో విడాకులు తీసుకుంది.ఇక విడాకుల తర్వాత సినిమాల్లో యాక్టివ్ అయిపోయింది. అలా సినిమాల్లో చేస్తున్న సమయంలోనే కృష్ణతో ప్రేమలో పడి కృష్ణని రెండో వివాహం చేసుకుంది. ఇక విజయనిర్మల కృష్ణ కాంబినేషన్లో దాదాపు 50 సినిమాల దాకా వచ్చాయి. అలా వారిమధ్య సాన్నిహిత్యం కుదిరింది. ఇక కృష్ణ విజయనిర్మలకు పెళ్లి అయినప్పటికీ వీరిద్దరికీ పిల్లలు లేరు.