అయితే ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ ఆదివారం అంటే నవంబర్ 17వ తేదీన రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ఈ ట్రైలర్ సోషల్ మీడియాలో ప్రకంపనలు సృష్టిస్తోంది. యూట్యూబ్ లో ఏకంగా 40 మిలియన్ల వ్యూస్, 1.4 మిలియన్లకు పైగా లైక్స్ వచ్చాయి. డిసెంబర్ 5వ తేదీన ఈ సినిమా రావడానికి సిద్ధంగా ఉంది. ప్రస్తుతం యూట్యూబ్లో టాప్ లో ట్రెండింగ్ లో పుష్ప2 ట్రైలర్ నిలిచింది.
ఈ ప్రచార చిత్రంతో సౌత్ ఇండియాలో అల్లు అర్జున్ ఓ ఘనతను కూడా తన ఖాతాలో వేసుకున్నాడు. సౌత్ ఇండియాలోనే అత్యంత వేగంగా 40 మిలియన్ల వ్యూస్ సాధించిన తెలుగు ట్రైలర్ గా పుష్ప 2 నిలిచింది. ఇది అల్లు అర్జున్ కెరీర్ లోనే ఆల్ టైం రికార్డ్ అని నిర్మాణ సంస్థ సోషల్ మీడియా వేదికగా పోస్టులు చేసింది. అయితే ఈ ట్రైలర్ బాగుందని దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళితో పాటు టాలీవుడ్ హీరోలు, హీరోయిన్లు అందరూ పోస్టులు పెడుతున్నారు.