సోషల్ మీడియాలో సినీ సెలబ్రిటీలకు ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇక ఈ మధ్యకాలంలో అయితే అటు సోషల్ మీడియా కారణంగా సెలబ్రిటీలకు ప్రేక్షకులకి మధ్య ఉన్న దూరం పూర్తిగా తగ్గిపోయింది. దీంతో తమ అభిమాన హీరో హీరోయిన్ల గురించి అన్ని విషయాలను కూడా ఇట్టే తెలుసుకోగలుగుతున్నారు. అయితే అటు సెలబ్రిటీలకు కూడా తమ పర్సనల్ లైఫ్ కి సంబంధించిన విషయాలను సైతం సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకోవడానికి సిద్ధమవుతూ ఉండడం కూడా చూస్తూ ఉన్నాం.


 ఇలా ఇండస్ట్రీలో స్టార్లుగా కొనసాగుతున్న వారి సంబంధించి ఇంటర్నెట్లో ఏ పోస్టు ప్రత్యక్షమైనా అది ఇట్టే వైరల్ గా మారిపోతూ ఉంటుంది. అయితే ఇలాంటి పోస్టులలో కొన్ని అందరిని అవాక్కయ్యేలా చేస్తూ ఉంటాయి అని చెప్పాలి. సాధారణంగా ఇండస్ట్రీలో స్టార్లుగా కొనసాగుతూ కోట్ల రూపాయలు సంపాదిస్తున్న వారు లగ్జరీ ఇల్లు లాంటివి కొనుగోలు చేసి ఇక మంచి విలాసవంతమైన జీవితాన్ని గడపడం చూస్తూ ఉంటాము. అయితే ఇక్కడ మనం మాట్లాడుకోబోయే హీరోయిన్ అయితే ఇక ఇంకా మరింత లగ్జరీగా జీవితాన్ని గడుపుతుంది అన్నది అర్థమవుతుంది. ఎందుకంటే ఏకంగా బంగారంతో తయారు చేసిన టూత్ బ్రష్ తో ఆ హీరోయిన్ పళ్ళు తోముతోంది.


 ఇందుకు సంబంధించిన వీడియో ని ఇటీవల ఇంటర్నెట్లో షేర్ చేయడంతో ఇది కాస్త వైరల్ గా మారిపోయింది. ఆ హీరోయిన్ ఎవరో కాదు కియారా అద్వానీ.  ఆమె ఇంస్టాగ్రామ్ స్టోరీ లో షేర్ చేసిన ఒక పోస్ట్ వైరల్ అవుతుంది. బంగారంతో చేసిన టూత్ బ్రష్ ను చేత పట్టుకున్న ఫోటోని పోస్ట్ చేస్తూ.. నోటితో చెప్పకుండానే నువ్వు సింధి అమ్మాయివి అని ఎలా చెప్తావ్ అంటే అంటూ క్యాప్షన్ ఇచ్చింది. సింది ప్రజలకు బంగారంపై ఉండే ఇష్టాన్ని వారి కల్చర్ ను పరోక్షంగా కియారా తెలిపింది. అయితే ఈ పోస్ట్ పై కొందరు సానుకూలంగా స్పందిస్తూ ఉండగా.. ఇంకొందరు షో ఆఫ్ కోసమే ఇదంతా చేసింది అంటూ కామెంట్లు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: