దివంగత నటుడు అక్కినేని నాగేశ్వరరావు ఎన్నో అద్భుతమైన చిత్రాలలో నటించి ప్రేక్షకులను అలరించారు. అక్కినేని నాగేశ్వరరావు 2014లో మరణించిన విషయం తెలిసిందే. ఆయన మరణ వార్త తెలిసి తెలుగు సినీ పరిశ్రమలో ఉన్న వారంతా షాక్ కు గురయ్యారు. అయితే తెలుగు సినీ దిగ్గజం అక్కినేని నాగేశ్వరరావు క్యాన్సర్ కారణంగా మరణించారని వార్తలు వచ్చాయి. కొన్ని రోజుల నుంచి క్యాన్సర్ సమస్యతో బాధపడి మరణించాడని అంతా అనుకున్నారు.


కానీ నాగేశ్వరరావు మరణానికి కారణం క్యాన్సర్ కాదని ఆయన గుండెపోటుతో మరణించారని ఇటీవలే వెలుగులోకి వచ్చింది. ఈ విషయాన్ని నాగేశ్వరరావు కుటుంబ సభ్యులు వెల్లడించారు. దివంగత నటుడు అక్కినేని నాగేశ్వరరావు గారు క్యాన్సర్ కారణంగా మరణించినట్లు అంతా అనుకున్నారన్నారు. కానీ అది నిజం కాదు ఆయన గుండెపోటుతో మరణించారని వెల్లడించారు.


1924 సెప్టెంబర్, 24 కృష్ణా జిల్లాలో వెంకటరత్నం, పున్నమ్మ దంపతులకు ఏఎన్నార్ జన్మించాడు. 1941లో అతి చిన్న వయసులోనే సి. పుల్లయ్య దర్శకత్వంలో తొలిసారి "ధర్మపత్ని" సినిమాతో సినీ పరిశ్రమకు పరిచయమయ్యారు. ఆ తర్వాత రెండేళ్లకే ఘంటసాల బలరామయ్య "సీతారామజననం" లో మొదటిసారి హీరోగా నటించాడు. అనంతరం మళ్లీ ఘంటసాలనే "బాలరాజు" సినిమాతో హిట్ అవడంతో నాగేశ్వరరావుకు ఫస్ట్ టైం బ్రేక్ దొరికింది. కొద్ది రోజుల్లో ఏఎన్ఆర్ చనిపోతాడని తెలిసి కూడా చివరిగా అక్కినేని మూడు తరాల హీరోలతో కలిసి "మనం" సినిమాలో నటించి ప్రజలందరి గుండెల్లో అమరజీవిగా నిలిచిపోయారు.


ఇక ఏఎన్నార్ మరణించడంతో ఒక్కసారిగా బాధ్యతలు అన్ని నాగార్జున పైనే పడ్డాయి. ఇంటి బాధ్యతలు, స్టూడియో బాధ్యత, పలు వ్యాపారాలకు సంబంధించిన బాధ్యతలు అన్నీ నాగార్జుననే చూసుకుంటున్నాడు. తన తండ్రి మరణంతో నాగార్జున ఒక్కసారిగా కృంగిపోయాడు. ఇప్పటికీ తన తండ్రిని తలుచుకుంటూ నాగార్జున బాధపడుతూనే ఉంటాడు. చాలా సందర్భాలలో తన తండ్రితో ఉన్న అనుబంధాన్ని నాగార్జున వెల్లడించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

anr