బాలీవుడ్ లో హీరోగా కొనసాగుతున్న ఆయుష్మాన్ ఖురానా గురించి సినీ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం అక్కర్లేదు. ఎందుకంటే తన సినిమాలతోనే అందరి హృదయాలలో ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నారు. అందరిలా కమర్షియల్ హాంగులు ఉన్న సినిమాలను మాత్రమే చేయకుండా.. ఎప్పుడూ కొత్తదనం ఉన్న సినిమాలతో ప్రేక్షకులను పలకరిస్తూ ఉంటాడు. ఇక సినిమా హిట్ అయినా ఇలా కొత్త సినిమాలను ప్రేక్షకులు ముందుకు తీసుకువచ్చి ప్రయోగాలను చేయడం మాత్రం అస్సలు ఆపడు అన్న విషయం తెలిసిందే. అందుకే ఆయుష్మాన్ ఖురానాకు మిగతా వాళ్ళతో పోల్చి చూస్తే మంచి గుర్తింపు వచ్చింది.


 బుల్లితెరపై వ్యాఖ్యాతగా కెరియర్ను ప్రారంభించిన ఆయుష్మాన్ ఖురానా తర్వాత కాలంలో గాయకుడిగా కూడా గుర్తింపును సంపాదించుకున్నాడు. అయితే ఇక ఎప్పుడూ ప్రయోగాత్మక సినిమాలు చేసే అతను విక్కీ డోనర్ అనే సినిమాతో హీరోగా తెరంగేట్రం చేశాడు. ఇక ఈ సినిమా కమర్షియల్ గా కూడా సూపర్ హిట్ అయింది అని చెప్పాలి. దీంతో ఆయుష్మాన్ ఖురానా కెరియర్ ఒక్కసారిగా మలుపు తిరిగింది. ఇక ఇప్పటికీ కూడా ఎన్నో ప్రయోగాత్మక సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నాడు. అయితే ఇటీవల తన పర్సనల్ లైఫ్ గురించి షాకింగ్ విషయాలను చెప్పుకొచ్చాడు ఈ హీరో.


 తన బాల్యం మొత్తం బాధాకరంగా ఉండేది అంటూ బాలీవుడ్ హీరో ఆయుష్మాన్ ఖురానా వెల్లడించారు. తన తండ్రి నియంతల ఉండేవాడు అంటూ చెప్పుకొచ్చారు. తనను చెప్పులు బెల్ట్ తో కొట్టే వాడు అంటూ తెలిపాడు. ఓసారి తాను సిగరెట్ తాగక పోయినప్పటికీ షర్ట్ ఆ స్మెల్ రావడంతో ఇక నన్ను విపరీతంగా కొట్టారు అంటూ ఒక పాడ్ కాస్ట్ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. నేను భార్య తహిర 20స్ లోనే పేరెంట్స్ అయ్యాం. నా తండ్రితో పోల్చి చూస్తే నేను డిఫరెంట్ ఫాదర్. పిల్లలతో ఎంతోఫ్రెండ్లీగా ఉంటా అంటూ ఆయుష్మాన్ ఖురానా చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: