అల్లు అర్జున్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అతి చిన్న వయసులోనే ఇండస్ట్రీకి హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. మొదట తాను నటించిన సినిమాలన్నీ పెద్దగా సక్సెస్ కాకపోవడంతో కాస్త డీలపడ్డాడు. అయినప్పటికీ ఏమాత్రం ఆలోచించకుండా వరుస పెట్టి సినిమాలు చేసుకుంటూ దూసుకుపోయాడు. ప్రస్తుతం అల్లు అర్జున్ పుష్ప సినిమాతో ఒక్కసారిగా పాన్ ఇండియా రేంజ్ లో పాపులర్ అయ్యాడు. ఈ సినిమాకు సుకుమార్ దర్శకత్వం వహించాడు. పుష్ప సినిమాకు సీక్వెల్ గా పుష్ప 2 సినిమా డిసెంబర్ 5వ తేదీన ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉంది.
దీనికోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ అభిమానులు ఎప్పటినుంచో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. పుష్ప సినిమా విజయం సాధించడంతో పుష్ప 2 సినిమాపై ప్రేక్షకుల్లో భారీగా అంచనాలు నెలకొన్నాయి. పుష్ప 2 సినిమా ఎన్నో అంచనాల నడుమ విడుదల కాబోతోంది. దాదాపుగా ఈ సినిమాకు రూ. 3000 కోట్ల బిజినెస్ జరుగుతుందట. దాదాపు రూ. 1000 కోట్ల బిజినెస్ పూర్తి చేసుకున్న పుష్పరాజ్ మొదటి రోజే 300 కోట్లు కొల్లగొట్టడానికి సిద్ధంగా ఉన్నాడని అంటున్నారు. సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చిన రూ. 1500 కోట్ల రూపాయలకు పైగా వసూలు చేసే అవకాశాలు ఉన్నాయని ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
ఈ నేపథ్యంలోనే పుష్ప 2 సినిమా టికెట్ల ధర విషయంలో కూడా భారీగా మార్పులు జరగాలని movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ సంస్థ ఆలోచనలు చేస్తున్నట్లుగా టాక్ వినిపిస్తోంది. తెలంగాణ రాష్ట్రంలో సినిమా టికెట్ల రేట్లు పెరగడం కొత్తేమీ కాదు. అయితే ఆంధ్రప్రదేశ్ లో రేట్లు ఎంత పెరుగుతాయని ఆసక్తికరమైన అంశం చోటుచేసుకుంది. గతంలో పుష్ప సినిమా విషయంలో నిర్మాతలకు సరైన సపోర్ట్ లభించలేదు. దీంతో డిస్ట్రిబ్యూటర్స్ భారీగా నష్టపోవాల్సి వచ్చింది.
అందుకే ఈసారి మంచి రెట్లు ఉండేలా చర్చలు జరపనున్నారు. సాధారణంగా సింగిల్ స్క్రీన్లలో టికెట్ల ధర 150-200 రూపాయల మధ్య ఉంటే పుష్ప 2 కోసం ఈ రేటును 300 రూపాయల వరకు పెంచే ప్రతిపాదనను ప్రభుత్వం ముందు ఉంచినట్లుగా టాక్ వినిపిస్తోంది. దీంతో సినీ ప్రేక్షకులు పుష్ప 2 సినిమా కోసం ప్రేక్షకుల రక్తాన్ని పీలుస్తారా అంటూ కామెంట్లు చేస్తున్నారు. మధ్య తరగతి కుటుంబం వాడు ఇంత రేట్లు పెట్టి సినిమా ఎలా చూస్తాడు అంటూ కొంతమంది నెగిటివ్ గా ట్రోల్ చేస్తున్నారు.