తెలుగు సినీ పరిశ్రమలో అద్భుతమైన క్రేజ్ ఉన్న నిర్మాతలలో దిల్ రాజు ఒకరు. ఈయన ఇప్పటివరకు తన బ్యానర్ లో ఎన్నో సినిమాలను నిర్మించగా అందులో చాలా మూవీలు మంచి విజయాలను అందుకున్నాయి. ఈయన బ్యానర్లో రూపొందిన సినిమాలలో ఓ మై ఫ్రెండ్ మూవీ ఒకటి. సిద్ధార్థ్ హీరోగా నటించిన ఈ మూవీ లో హన్సిక హీరోయిన్గా నటించగా శృతి హాసన్ ఈ మూవీలో ఓ కీలకమైన పాత్రలో నటించింది. వేణు శ్రీరామ్మూవీ కి దర్శకత్వం వహించాడు. ఇకపోతే ఈ సినిమాకు సంబంధించిన కొన్ని ఇంట్రెస్టింగ్ వివరాలను దిల్ రాజు ఓ ఇంటర్వ్యూలో తెలియజేశాడు.

దిల్ రాజు ఓ మై ఫ్రెండ్ మూవీ గురించి మాట్లాడుతూ ... సిద్ధార్థ్ హీరోగా హన్సిక హీరోయిన్గా శృతి హాసన్ కీలక పాత్రలో వేణు శ్రీరామ్ దర్శకత్వంలో ఓ మై ఫ్రెండ్ అనే సినిమాను స్టార్ట్ చేశాం. సినిమా సగ భాగం పూర్తి అయింది. నేను సినిమాను చూశాను. ఆ తర్వాత నాకు ఎక్కడో ఆ సినిమా తేడా కొట్టింది. వెంటనే నేను వేణు శ్రీరామ్ కి నా ఒపీనియన్ చెప్పాను. ఇక అదే సమయంలో వేరే వాళ్లకు ఆ సినిమా బాగానే నచ్చింది. కానీ నాకు సినిమా ఫస్టాఫ్ నచ్చకపోవడంతో సెకండ్ హాఫ్ లో ఆలీ తో కొన్ని కామెడీ ట్రాక్స్ ను చిత్రీకరించి ఆడ్ చేసాం. అయినా నాకు పెద్దగా సినిమా సాటిస్ఫై అనిపించలేదు. ఇక సినిమా విడుదల అయింది. మొదటి రోజు ఈ సినిమాకు బ్లాక్ బస్టర్ టాక్ వచ్చింది.

దానితో నా జడ్జిమెంట్ రాంగ్ అనే నేను అనుకున్నాను. ఇక ఆ తర్వాత నుండి సినిమా కలెక్షన్లు డ్రాప్ అయ్యాయి. ఓవరాల్ గా ఈ సినిమాకు పెద్ద గొప్ప కలెక్షన్స్ రాలేదు. దానితో నా జడ్జిమెంట్ కరెక్ట్ అని చాలా మంది ఆ సినిమాకు సంబంధించిన వారు అనుకున్నారు. ఇక ఆ సినిమా ఫ్లాప్ కావడానికి ప్రధాన కారణం. ఆ మూవీ బాగానే ఉన్నప్పటికీ ఎక్కువ శాతం మందికి ఆ సినిమా కనెక్ట్ కాలేదు. చాలా తక్కువ శాతం మందికే మూవీ కనెక్ట్ అయింది. అందుకే ఆ సినిమా పెద్ద స్థాయిలో సక్సెస్ కాలేదు అది ఓ ఇంటర్వ్యూలో దిల్ రాజు చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: