అయితే రెండవ ట్రైలర్లో కథలోని ఎమోషన్స్ సన్ని వేశాలని చూపించి.. అలాగే పలు డైలాగులతో కామెడీ టైమింగ్ తో ప్రేక్షకుల ఆకట్టుకునేలా చూపించారు. ముఖ్యంగా సినిమా కథ మొత్తం హీరో మెకానిక్ షాప్ స్థలం కోసమే అన్నట్లుగా కనిపిస్తోంది. ఇందులో హీరో తండ్రిగా వికే.నరేష్ నటించారు. స్థలం కోసం తన తండ్రిని విలన్ వేధిస్తూ ఉంటారు. ఆ తర్వాత షెడ్డు ని కూల్చేయడం వంటివి చూపించారు. అందుకోసం హీరో విలన్ తో ఎలా పోరాడారు అనే పాయింట్ తో ఈ సినిమాని టచ్ చేసినట్లుగా ట్రైలర్లో కనిపిస్తోంది.
విశ్వక్ సేన్ మాస్ డైలాగులు ఇందులో మరొకసారి వినిపిస్తాయి. మీనాక్షి చౌదరి , శ్రద్ధ శ్రీనాథ్, విశ్వక్సేన్ మధ్య జరిగేటువంటి సన్నివేశాలు కూడా బాగానే ఆకట్టుకుంటున్నాయి. ఇందులో విలన్ గా సునీల్ లుక్ ఆకట్టుకున్నట్లు కనిపిస్తోంది. మరి ఈసారైనా మీనాక్షి చౌదరికి అదృష్టం కలిసి వచ్చి మెకానిక్ రాఖీ సినిమాతో సక్సెస్ అందుకుంటుందేమో చూడాలి. మొత్తానికి మెకానిక్ రాఖీ సినిమాతో విశ్వక్ సక్సెస్ అందుకునేలా కనిపిస్తున్నారని అభిమానులైతే కామెంట్స్ చేస్తున్నారు. మరి ఏం జరుగుతుందనే విషయం తెలియాలి అంటే నవంబర్ 22 వరకు ఆగాల్సిందే.