సినిమా ప్రపంచం అంటేనే మాయ ప్రపంచం. ఇక్కడ చాలా జాగ్రత్తగా అడుగులు వేయాలి. ఏమాత్రం తేడా వచ్చిన సినిమా కథ‌లే కాదు .. నిజ జీవిత కథలు కూడా గందరగోళంగా మారి పోతూ ఉంటాయి. ఇలా అనుకోకుండా తప్పట‌డుగులు వేసి జీవితాలను నాశనం చేసుకున్న హీరోలు .. హీరోయిన్లు కూడా ఉన్నారు. ఇలాంటి వారిలో ఒకప్పటి హీరోయిన్ రాజసులోచన ఒకరు. ఈమె గురించి ప్రస్తుతనికి పెద్దగా తెలియకపోవచ్చు.. కానీ ఒకప్పుడు సావిత్రి - భానుమతి లాంటి హీరోయిన్లకు ఆమె గట్టి పోటీ ఇచ్చారు. నటనలోనే కాదు నాట్యం - గాత్రం ఇలా రెండుమూడు విభాగాల్లో తనకంటూ ప్రత్యేకతను చాటుకున్న రాజసూచన .. తెలుగు తెరపై అప్పటి ప్రేక్షకుల నుంచి మంచి మార్కులు వేయించుకున్నారు.


అయితే నిజ జీవితంలో మాత్రం ఆమె నిలదొక్కుకోలేకపోయారు. మహానటి సావిత్రితో ఆమె అత్యంత చనువుగా ఉండటమే కాదు .. సావిత్రి ప్రోత్సాహంతో డ్యాన్స్ స్కూల్ కూడా నిర్వహించారు. పసుమర్తి కృష్ణమూర్తి తో కలిసి సినిమాల్లోనే కాకుండా బయట కూడా అనేక వేదికలపై రాజ సులోచన డ్యాన్సు ప్రోగ్రాములు ఇచ్చారు. నిజజీవితంలోకి వచ్చేసరికే ఆమె మొదట్లో చాలా జాగ్రత్తలు తీసుకున్న ఆమె కెరీర్లు అనూహ్య‌ మలుపులు తిరిగాయి. ప్రేమించి పెళ్లి చేసుకుని ఒక బిడ్డ పుట్టిన తర్వాత ఆమె భర్తకు విడాకులు ఇచ్చేశారు.


ఆ తర్వాత దర్శకుడు సిఎస్ రావుకు చేరు అయ్యారు. సిఎస్ రావు దర్శకత్వంలోనే రాజ‌సులోచ‌న‌ అనేక సినిమాలో నటించారు .. వీరిద్దరూ చాలా చనువుగా ఉండేవారు. ఈ పరిచయమే వారిని పెళ్లి వరకు నడిపించింది. అప్పటికే రావుకు కూడా పెళ్లి కావడమే కాదు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అయినా రాజ సులోచన ఇష్టపడి ఆయనను రెండో పెళ్లి చేసుకుంది. వీరికి ఇద్దరు కవల పిల్లలు పుట్టిన‌ తర్వాత ఎంత ప్రేమించుకున్న వీరిమధ్య కూడా విభేదాలు వచ్చాయి. ఇద్దరూ విడిపోయారు. చివరకు ఒంటరిగానే రాజ సులోచన కన్నుమూశారు. తనకు వివాహాలు కలిసి రాలేదని ఆమె ఎంతో బాధపడేవారు.

మరింత సమాచారం తెలుసుకోండి: