నటరత్న ఎన్టీఆర్ ఎన్నో సినిమాలలో కలిసి నటించారు. తెలుగు సినిమా రంగాన్ని దేశవ్యాప్తంగా చాటి చెప్పిన ఘనత కచ్చితంగా ఎన్టీ రామారావుకి దక్కుతుంది. సినిమాలలో కృష్ణుడు - రాముడు - దుర్యోధనుడు - రావణుడు ఇలా ఎన్నో అద్భుతమైన పాత్రలలో నటించిన ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వచ్చి తెలుగుదేశం పార్టీ స్థాపించి కేవలం 9 నెలల లోని అధికారంలోకి వచ్చి సమైక్య ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయ్యారు. ఎన్టీఆర్ రికార్డు నభూతోః న భవిష్యత్. ఇదిలా ఉంటే బ్లాక్ అండ్ వైట్ యుగంలో అగ్రతారలుగా వెలుగొందిన హీరోయిన్లలో దేవిక ఒకరు. ఈమె వాస్తవానికి వేదాంతం రాఘవయ్య గారి కుమార్తె కూతురు .. అంటే వరుసకు సొంత మనవరాలు.. కానీ ఎక్కడా ఎవరికీ తెలియదు. ఆమె కూడా తన తాత పేరు ఏనాడు చెప్పుకోలేరు.
చివరకు రాఘవయ్యతో పని చేయాల్సి వచ్చినప్పుడు కూడా అమ్మాయి అని పిలిచేవారు. తప్ప ఇండస్ట్రీలో ఎక్కడ బంధుత్వం కలిపేవారు కాదు.. చివరకు నిర్మాతలకు కూడా ఈ విషయం తెలియదు. అంటే ఎంత గోప్యం గా ఉంచేవారో తెలుస్తోంది. దేవిక తొలినాళ్లలో హీరోయిన్ పాత్రలు అందుకున్నారు. తమిళంలో ఆమెకు తొలి అవకాశం వచ్చింది. ఆ తర్వాత తెలుగులో సీనియర్ ఎన్టీఆర్ దేవీకును బాగా ప్రమోట్ చేశారు. తన సినిమాల్లో చాలా ఛాన్సులు ఇచ్చారు. ఎన్టీఆర్ తొలి ప్రియురాలు దేవిక అన్న రూమర్ కూడా అప్పట్లో ఉండేది. దేవిక అప్పట్లో సావిత్రి లాంటి స్టార్ హీరోయిన్లతో పోటీ పడాల్సి వచ్చేది.
కెరీర్ ప్రారంభ సమయంలో ఒకరిద్దరూ అత్యంత సన్నిహితులు ఆఫర్ల కోసం అయినా తాతగారి పేరు వాడుకోవచ్చుగా అని ఆమెకు చెప్పారట. దేవిక మాత్రం ఇష్టపడలేదు. వేదాంతం రాఘవయ్య తన తాత అన్న విషయాన్ని సీక్రెట్ గా ఉంచారు. ఇదే విషయాన్ని ఎన్టీఆర్ కూడా ఒక సందర్భంలో ప్రస్తావించి దేవికను ప్రత్యేకంగా మెచ్చుకున్నారు.. ఎంతోమంది చెట్టు పేరు చెప్పుకుని కాయలు అమ్ముకుంటున్న దేవికను మాత్రం నటనని నమ్ముకుని ఏనాడు తాత పేరు చెప్పి ఒక ఆఫర్ కూడా తెచ్చుకోలేదని ఎన్టీఆర్ ప్రశంసించడం విశేషం.