- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ ) . .

మెగాస్టార్ చిరంజీవి తన 3 దశాబ్దాల కెరీర్ లో 150 పైగా సినిమాలలో నటించారు. ఇన్నేళ్ల కెరీర్లో ఇన్ని సినిమాలలో నటించిన చిరంజీవి ఎంతో మంది హీరోయిన్లతో కలిసి నటించారు. పాత తరం హీరోయిన్లలో రాధిక - నళిని - శ్రీదేవి ఆ తర్వాత రాధా - విజయశాంతి 1990వ దశకం తర్వాత నగ్మా - వాణీ విశ్వనాథ్ - రంభ - రోజా - రమ్యకృష్ణ ఆ తర్వాత సిమ్రాన్ - సాక్షి శివానంద్ - ఆర్తి అగర్వాల్ - సోనాలి బింద్రే - సౌందర్య మీనా లాంటి హీరోయిన్లతో ఎన్నో సూపర్ హిట్ సినిమాలు కొట్టారు. 10 ఏళ్ల గ్యాప్ తర్వాత తిరిగి సినిమాలోకి ఎంట్రీ ఇచ్చిన చిరంజీవి ఈతరం జనరేషన్ హీరోయిన్లు తమన్నా - నయనతార - కాజల్ తో ను జట్టు కట్టారు.


వాల్తేరు వీర‌య్య‌ సినిమాలో శృతిహాసన్తోను జోడి కట్టారు.. ఇలా ఎంతో మంది హీరోయిన్లతో నటించిన చిరు కు ఎప్పుడు ఏ హీరోయిన్ నుంచి ఇబ్బంది ఎదురు కాలేదట. అయితే ఒక హీరోయిన్ మాత్రం చిరు నే టెన్షన్ పెట్టేసింది. ఈ విషయాన్ని చిరంజీవి స్వయంగా చెప్పారు. ఆమె ఎవ‌రో కాదు రాధ. చిరంజీవి డ్యాన్సులకు పెట్టింది పేరు. ఆయనతో పోటీపడి డ్యాన్సులు వేయాలంటే హీరోయిన్లకు సాధ్యం కాదు. కానీ ఒక రాధ మాత్రం చిరంజీవి ని టెన్ష‌న్ పెట్టేలా డ్యాన్స్ చేసేదట.


డైరెక్టర్ కానీ డ్యాన్స్ మాస్టర్ కానీ ఏదైనా ఒక స్టెప్ చేసినప్పుడు రాధ క్షణాల్లో రెడీ అయిపోయే వారట. అదే చిరంజీవికి కనీసం రెండు నిమిషాలు టైం కావాల్సి వచ్చేదట. అలాంటి టైంలో రాధ స్పీడ్ .. ఆ గ్రేస్‌ చూసి ఒక్కోసారి తనకే టెన్షన్ వచ్చిందని చిరంజీవి స్వయంగా చెప్పారు. చిరంజీవి - రాధ కాంబినేషన్లో ఎన్నో సూపర్ డూపర్ హిట్ సినిమాలు వచ్చిన సంగతి తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: