పాయల్ రాజ్ పుత్.. ఈ పేరు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు..టాలీవుడ్ హాట్ బ్యూటీ గా పాయల్ సూపర్ క్రేజ్ సంపాదించుకుంది.. తన మొదటి సినిమా ‘ఆర్ఎక్స్100’ లో ఈ భామ చేసిన అందాల అరాచకం అంతా ఇంతా కాదు.. మొదటి సినిమాలో హీరోతో రొమాంటిక్ సీన్స్ లో నటించి ప్రేక్షకులకు పిచ్చెక్కించింది.. ఈ భామకు ఆర్ఎక్స్ 100 తరువాత ఆఫర్స్ భారీగానే వచ్చాయి.. కానీ అవి ఏవి కూడా ఈ రేంజ్ ఫేమ్ మాత్రం తీసుకురాలేకపోయాయి.. ఆర్ఎక్స్100 సినిమాలో పాయల్ అందంతోనే కాదు పెర్ఫార్మన్స్ పరంగా అద్భుతంగా చేసింది.. పాయల్ తన కెరీర్ బెస్ట్ పెర్ఫార్మన్స్ ఇచ్చిన సినిమా ‘ఆర్ఎక్స్100’.. ఈ సినిమాలో ప్రేమ పేరుతో హీరోని మోసం చేసే హీరోయిన్ గా పాయల్ అద్భుతంగా నటించింది..తన కోరిక తీర్చుకునేందుకు ప్రేమ అనే పేరుతో హీరోను ఎలా లొంగదీసుకుందో దర్శకుడు అజయ్ భూపతి అద్భుతంగా చూపించాడు.. 

హీరోయిన్ పాత్రలో ఉండాల్సిన చిలిపితనం అలాగే అదే హీరోయిన్ నెగిటివ్ పాత్రలో కనిపిస్తే ఎలాంటి హవభావాలు పలికిస్తుందో పాయల్ ఈ సినిమాలో ‘ఇందు’ అనే పాత్రలో చూపించింది.. ఈ సినిమాలో హీరో కార్తికేయ అయినా కూడా పేరు మాత్రం పాయల్ కే ఎక్కువ వచ్చింది..అయితే హీరో పాత్రలో కార్తీకేయ అద్భుతంగా నటించాడు..పాయల్ రాజ్ పుత్ ఆ తరువాత వరుస సినిమాలను చేసినా అవి అన్నీ  ప్రేక్షకులని అస్సలు మెప్పించలేదు.. దీనితో తన కెరీర్ లో ఆర్ఎక్స్ 100 వంటి బ్లాక్ బస్టర్ ఇచ్చిన దర్శకుడు అజయ్ భూపతి పాయల్ ను మెయిన్ లీడ్ గా ఉంచి ‘మంగళవారం’ అనే సినిమా తెరకెక్కించాడు..ఈ సినిమాలో సైతం పాయల్ బోల్డ్ పాత్రలో నటించి మెప్పించింది.. ఈ సినిమాలో పాయల్ నటన అద్భుతమని చెప్పాలి..మంగళవారం సినిమా పాయల్ కెరీర్ ని మరోసారి మలుపు తిప్పింది.. గత ఏడాది వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీస్ లో పాయల్ నటించిన మంగళవారం సినిమా ఒకటిగా నిలిచింది.. పాయల్ మంగళవారం సినిమాలో కెరీర్ బెస్ట్ పెర్ఫార్మన్స్ ఇచ్చి ప్రేక్షకులని ఎంతగానో ఆకట్టుకుంది..

మరింత సమాచారం తెలుసుకోండి: