ఈ అనంత విశ్వంలో
ఎవరికీ అంతు చిక్కని కాలంలో
ఎన్నో శేష ప్రశ్నలు మరెన్నో సందేహాలు
కార్య సాధకులకు పెరిగే వయసు ఒక సంఖ్య మాత్రమే
చాలామందికి పెరిగే వయసు మోయలేని భారం
ఖ్యాతి సాధించిన వారు తమ జీవిత చరిత్ర రచనలలో
గతంలోకి వెళితే ఎన్నో జ్ఞాపకాలు
ఏమీ సాధించలేని వారు
వారి పరాజయాన్ని లెక్క పెడుతూ కాలం గడుపుతూ ఉంటారు
కాలం మాత్రం అందర్నీ సరిసమానంగా
తనకు తోచిన రీతిలో తీర్పు ఇవ్వడం సహజం..


బియ్యం పై ఆధారపడిన పుష్ప 2 !


ఇండియన్ ఫిలిమ్ ఇండస్ట్రీ అత్యంత ఆశక్తిగా ఎదురుచూస్తున్న సినిమాలలో ప్రధమస్థానంలో ‘పుష్ప 2’ కొనసాగుతోంది. ఈమూవీకి దేశవ్యాప్తంగా ఏర్పడిన మ్యానియా చూస్తుంటే ఈమూవీ మొదటిరోజు ఓపెనింగ్ కలక్షన్స్ ప్రపంచ వ్యాప్తంగా 300 కోట్లు దాటినా ఆశ్చర్యం లేదు అంటున్నారు. ఈమూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ బాలీవుడ్ వర్గాలు షాక్ అయ్యేలా నిర్వహించడం ఇండియన్ ఫిలిమ్ ఇండస్ట్రీలో మరొక హాట్ టాపిక్ గా మారింది. 


ఇక పబ్లిసిటీ విషయంలో ఏమాత్రం రాజీ పడకుండా దేశవ్యాప్తంగా అత్యంత భారీ స్థాయిలో నిర్వహిస్తూ ఉండటంతో ఈమూవీ టోటల్ కలక్షన్స్ ‘ఆర్ ఆర్ ఆర్’ కలక్షన్స్ ను బ్రేక్ చేసినా ఆశ్చర్యయంలేదు అంటున్నారు. ఒక ఓవర్సీస్ ధియేటర్లలో అమ్మే కూల్ డ్రింక్ పాప్ కార్న్ లతో పాటు అమెరికాలోని అనేక జనరల్ స్టోర్స్ లో దొరికే బియ్యం బస్తాల కవర్ల పై కూడ ‘పుష్ప 2’ ఫోటోలు కనిపిస్తూ ఉండటంతో అమెరికాలోని ప్రతి ఇంటిలోనూ ‘పుష్ప 2’ లో కొనసాగుతోంది. 


ఇక ఆడియో ర్యాంకింగ్స్ విషయంలోకి వస్తే లేటెస్ట్ ఆడియో ర్యాంకింగ్స్ లో ‘పుష్ప’ టైటిల్ సాంగ్ రెండవ స్థానంలో కొనసాగుతూ మరికొన్ని రోజులలోనే నెంబర్ వన్ స్థానానికి వచ్చినా ఆశ్చర్యంలేదు అని అంటున్నారు. ఇక శ్రీలీల తో బన్నీ చేసిన ఐటమ్ సాంగ్ క్లిపింగ్స్ ను ఈమూవీ విడుదలకు ఒక వారం రోజులు ముందు విడుదల చేసి ఈమూవీ మ్యానియాను మరింత పెంచాలని ఈమూవీ యూనిట్ వర్గాలు భావిస్తున్నాయి. 


దేశవ్యాప్తంగా 17 నగరాలలో జరగబోతున్న ఈమూవీ ప్రమోషన్ ఈవెంట్స్ కోసం ఒక ప్రత్యేకమైన విమానాన్ని బన్నీ ఇతర నటీనటుల కోసం ఏర్పాటు చేసి ఈమూవీ ఈవెంట్స్ ను సక్సస్ చేయాలని మాష్టర్ ప్లాన్ లో ఉన్నారు. తెలుగు రాష్ట్రాలలో అర్థరాత్రి షోలతో ఈమూవీ విద్వంశం డిసెంబర్ 5 నుండి అర్థరాత్రి మొదలుకాబోతోంది. ఈమధ్య కాలంలో టాప్ హీరోల సినిమాలకు నెగిటివ్ టాక్ స్ప్రెడ్ చేయడం ఒక అలవాటుగా మారింది. ఈ ప్రమాదాన్ని తట్టుకుని నిలబడగలిగితే ‘పుష్ప 2’ కలక్షన్స్ రికార్డులు బద్ధలు కొట్టడం ఖాయం..    




ReplyForward
Add reaction

మరింత సమాచారం తెలుసుకోండి: