ఆ మధ్య విజయ్ దేవరకొండ, రష్మిక ఇద్దరూ కూడా వేరువేరుగా ఒకే ఇంట్లో ఉన్నట్లుగా పలు రకాల ఫోటోలు వైరల్ గా మారాయి. ముఖ్యంగా ఇద్దరి బ్యాగ్రౌండ్ కూడా ఒకే రకంగా ఉండడంతో మరోసారి రూమర్స్ కు స్థానం కల్పించింది. రష్మిక తన అసిస్టెంట్ వివాహం కోసం హైదరాబాద్ కి వెళ్లడం అసిస్టెంట్ పెళ్లికి హాజరైన తర్వాత అటు విజయ్ దేవరకొండ ఇంటికి వెళ్లినట్లు సమాచారం. ఆ సమయంలోనే రష్మిక తీసుకున్న ఒక ఫోటో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో మరింత ఆశ్చర్యానికి గురిచేసింది.
విజయ్ ఇంట్లోనే రష్మిక ఉన్నదంటూ పలువురు అభిమానులు కన్ఫామ్ చేశారు. అయితే ఇప్పుడు తాజాగా మరొకసారి విజయ్ దేవరకొండ ప్రేమ గురించి మాట్లాడుతూ పలు విషయాలను తెలియజేశారు. ప్రేమ అనేది తప్పక ఎవరికైనా కలుగుతుంది ముఖ్యంగా అబ్బాయిలకు.. మీరు ఇంకా యంగ్ గానే ఉన్నారు.. కాబట్టి కాస్త సమయం ఇవ్వండి అన్నిటికంటే ముందుగా పురుషులు ఎదగాలి.. ఇదేం చెడ్డ విషయం కాదు అయితే ప్రేమకు కొంత సమయాన్ని ఇవ్వాల్సి ఉంటుందంటూ తెలిపారు విజయ్ దేవరకొండ.
ముఖ్యంగా ప్రేమ విషయంలో 30 ఏళ్లు దాటిన పురుషులు 20 ఏళ్ల పురుషుల కంటే కాస్త బెటర్ గాని ఆలోచిస్తారని తెలిపింది.20 నుంచి 30 ఏళ్ల మధ్య మనం ఎలాంటి విషయాన్ని తీసుకోవాలన్న డిసైడ్ చేసుకోలేని పరిస్థితులలో ఉంటాము.. సమయం వచ్చినప్పుడు వాటంత అవే జరుగుతూ ఉంటాయని తెలిపారు. దీంతో రష్మిక తో లవ్ లో ఉండడం వల్లే విజయ్ ఇలా కామెంట్స్ చేశారని పలువురుని డిజైన్స్ కామెంట్స్ చేస్తున్నారు.