ఇక ఇప్పుడు సౌత్ ఇండస్ట్రీలో ఎవరిదైనా స్టార్ హీరో సినిమా వస్తుందంటే చాలు అందులో హీరోయిన్గా మీనాక్షిని ఎంపిక చేస్తూ ఉన్నారు దర్శకనిర్మాతలు. ఇక ఇప్పుడు ఫుల్ బిజీ హీరోయిన్గా మారిపోయింది ఈ ముద్దుగుమ్మ. ఒకవైపు స్టార్ హీరోల సరసన నటిస్తూనే ఇంకోవైపు మిడ్ రేంజ్ హీరోల సరసన కూడా నటిస్తూ ఇక ఏ సినిమాను వదలట్లేదు. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి అన్న చందంగా అన్ని సినిమాలను ఓకే చేస్తూనే.. ఇక కొన్ని కథల విషయంలో ఆచీ తుంచి అడుగులు వేస్తుంది మీనాక్షి చౌదరి.
కాగా ఇప్పుడు మెకానిక్ రాఖీ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. విశ్వక్సేన్ హీరోగా రాబోతున్న మెకానిక్ రాఖీ మూవీ విడుదలకు సిద్ధమవుతుంది. ఇటీవల విడుదలైన ట్రైలర్ సినిమాపై అంచనాలను పెంచేస్తుంది. అయితే ఇటీవల ఈ సినిమా ప్రమోషన్స్ లో పాల్గొన్న మీనాక్షి చౌదరి.. తనపై వస్తున్న రూమర్స్ గురించి స్పందించింది. నేనొక తమిళ యాక్టర్ కొడుకుని పెళ్లి చేసుకోవడానికి సిద్ధమయ్యాను అంటూ రూమర్ వచ్చింది. అందులో ఎలాంటి నిజం లేదు అంటూ స్పష్టం చేసింది. తాను ఇప్పుడు సింగిల్గానే ఉన్నానని మింగిల్ అవ్వడానికి రెడీగా లేను అంటూ చెప్పింది. కెరియర్ పైన తన దృష్టి ఉందని ఇక ఏదైనా శుభవార్త ఉంటే తానే స్వయంగా అభిమానులతో పంచుకుంటాను అంటూ మీనాక్షి చౌదరి చెప్పుకొచ్చింది.