ప్రస్తుతం కోలీవుడ్ మీడియాలో ధనుష్ నయనతారకి సంబంధించిన వివాదమే హల్చల్ చేస్తోంది.అయితే ఈ వివాదం మెల్లిమెల్లిగా సౌత్ ఇండస్ట్రీ మొత్తం పాకింది.ఇక ఓవైపు ధనుష్ లాయర్ 10 కోట్లు కట్టాల్సిందే అని చెప్పినప్పటికీ నయనతార మాత్రం వినకుండా తన డాక్యుమెంటరీని నెట్ ఫిక్స్ లో విడుదల చేయించింది. దీంతో ఫైర్ అయిన ధనుష్ తన లాయర్ తో 10 కోట్లు కట్టకపోతే నయనతార తో పాటు నెట్ఫ్లిక్స్ పై మీద కూడా కేసు పెడతామంటూ వార్నింగ్ ఇప్పించారు. అయినా కానీ నయనతార తగ్గడం లేదు.ఇదంతా పక్కన పెడితే మంచి ఫ్రెండ్స్ గా ఉండే నయనతార ధనుష్ ల మధ్య గొడవ ఎక్కడ జరిగింది? విగ్నేష్ నీ పెళ్లి చేసుకోవడమే ధనుష్ లో పగ బెంచిందా అనేది ఇప్పుడు చూద్దాం.. ధనుష్ నయనతార ల మధ్య ఒకప్పుడు మంచి స్నేహం ఉండేది.రజనీకాంత్ నయన్ ల కుశలన్ మూవీలో ధనుష్ గెస్ట్ రోల్ చేశారు. 

ఆ టైంలోనే ధనుష్ నయన్ ల మధ్య ఫ్రెండ్షిప్ కుదిరింది.ఆ తర్వాత ధనుష్ చేసే యారది నీ మోహిని సినిమాలో నయనతారని హీరోయిన్గా తీసుకున్నాడు. అలా ఈ సినిమా సమయంలో వీరి మధ్య మంచి సాన్నిహిత్యం ఏర్పడిందట.అయితే లేడీస్ మ్యాన్ అయిన ధనుష్ నయన్ తో ప్రేమలో పడ్డారని అప్పట్లో తమిళ మీడియా కోడై కూసింది.కానీ ఈ వార్తలను వీరిద్దరూ పట్టించుకోలేదు.అయితే నయనతార వరుస బ్రేకప్స్ తో కుంగిపోయిన సమయంలో నానుమ్ రౌడీ ధాన్ మూవీ డైరెక్టర్ విజ్ఞేష్ శివన్ ని చూసి తొలి చూపులోనే ప్రేమలో పడి ఎలాగైనా సరే పెళ్లి చేసుకోవాలి అనుకుంది.అలా లవ్ ప్రపోజ్ చేసి పెళ్లి చేసుకుంది. అ

యితే వీరిద్దరు పెళ్లి చేసుకోవడం ధనుష్ కి అస్సలు నచ్చలేదని, వీరి ప్రేమ పెళ్లి కోసం తన సినిమాని వాడుకున్నారని, వీరి పెళ్లి సమయంలో కొన్ని రూమర్లు వినిపించాయి.దాంతో ధనుష్ అప్పటినుండి నయనతార విజ్ఞేష్ శివన్ లపై కోపం పెంచుకున్నాడు అని తెలుస్తుంది. అందుకే వీరి మీద ఉన్న కోపాన్ని డాక్యుమెంటరీలో తన సినిమాకి సంబంధించిన ఏ చిన్న బిట్ని కూడా ఉపయోగించకూడదని చెప్పారట. కానీ నయన్ మాత్రం వినకుండా తన డాక్యుమెంటరీలో నానుమ్ రౌడీ ధాన్ కి సంబంధించిన 15 సెకండ్ల వీడియోని పెట్టుకుంది. దాంతో ఈ వివాదం మరింత ముదిరింది

మరింత సమాచారం తెలుసుకోండి: