సీనియర్ నటి రమ్యకృష్ణ గురించి ఎంత చెప్పినా తక్కువ అవుతుంది. సిల్వర్ స్క్రీన్ పై ఎన్నో అద్భుతమైన చిత్రాలలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఎలాంటి పాత్రలలోనైనా అద్భుతంగా నటిస్తోంది. అందంగా, పొగరుబోతు అమ్మాయిల, భావోద్వేగమైన సన్నివేశాల్లో కన్నీళ్లు పెట్టించాలనుకున్న రమ్యకృష్ణనే ముందు వరసలో ఉంటారు. ఇప్పటికీ రమ్యకృష్ణ తనకు వస్తున్న సినీ అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ ప్రేక్షకులను అలరిస్తోంది.


దాదాపు 35 ఏళ్లకు పైగా రమ్యకృష్ణ తన సినీ కెరీర్ ని సక్సెస్ఫుల్ గా రాణిస్తోంది. "రొమాంటిక్", "రిపబ్లిక్" లలో నటించి... "లైగర్", "బంగార్రాజు" వంటి సినిమాలతో మెప్పించింది. ఇండస్ట్రీలో ఉన్న అగ్ర హీరోలు అందరి సరసన హీరోయిన్గా చేసింది. రమ్యకృష్ణ కెరీర్ ఆరంభంలో ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంది. ఇండస్ట్రీకి వచ్చిన వెంటనే మంచి గుర్తింపు రాలేదు. దాదాపు 15కు పైగా సినిమాల్లో నటించిన అనంతరం స్టార్ స్టేటస్ లభించింది. అయితే రమ్యకృష్ణ కెరీర్ ని మలుపు తిప్పిన సినిమాలలో "నరసింహ" సినిమా ఒకటి.


ఈ సినిమాకు కె ఎస్ రవికుమార్ దర్శకత్వం వహించాడు. ఇందులో సౌందర్య హీరోయిన్ గా నటించగా, రమ్యకృష్ణ నీలాంబరి అనే పవర్ఫుల్ పాత్రలో నటించి ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. సినిమాలో రజనీకాంత్ పాత్రకి సమానంగా రమ్యకృష్ణ పాత్ర ఉంటుంది.అయితే ఈ సినిమాలో సౌందర్యం ముఖం పైన కాలు పెట్టే సన్నివేశంలో రమ్యకృష్ణ నటించే సమయంలో చాలా ఇబ్బంది పడ్డానని ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది.


మొదట ఈ సన్నివేశంలో నటించడానికి రమ్యకృష్ణ అస్సలు ఒప్పుకోలేదు. కానీ దర్శకుడు రిక్వెస్ట్ చేయడంతో ఆ సీన్ లో నటించింది. ఒకవేళ ఈ సినిమాలో కనుక నీలాంబరి పాత్ర కావాలా, లేదంటే సౌందర్య పాత్ర కావాలా అని దర్శకుడు అడిగి ఉంటే నేను కచ్చితంగా సౌందర్య పాత్రని ఎంచుకునే దాన్ని అంటూ రమ్యకృష్ణ వెల్లడించింది. కానీ ఈ సినిమాలో నీలాంబరి పాత్రలో రమ్యకృష్ణ నటనకు ప్రేక్షకుల నుంచి మంచి ప్రశంసలు వచ్చాయి. ఈ సినిమా అనంతరం రమ్యకృష్ణ వేనుదిరిగి చూసుకోకుండా వరుసపెట్టి సినిమాలలో నటించి సక్సెస్ఫుల్ హీరోయిన్గా రాణించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: