మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ నటించిన దేవర సినిమా ఈ ఏడాది సెప్టెంబర్ 27 న గ్రాండ్ గా రిలీజ్ అయి ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.దేవర సినిమాకు ముందుగా నెగటివ్ టాక్ వచ్చినా కూడా భారీగా కలెక్షన్స్ సాధించి ఎన్టీఆర్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది.ఇదిలా ఉంటే దేవర సినిమాకు పాన్ ఇండియా వైడ్ హ్యూజ్ రెస్పాన్స్ రావడానికి కారణం ఎన్టీఆర్..  దేవర సినిమాను ఏ భాషలో చూసినా వినపడేది ఎన్టీఆర్ వాయిస్. అందులో ఏ సందేహం  లేదు. సినిమా ఎక్కడ రిలీజ్ అయినా కూడా స్వయంగా తానే డబ్బింగ్ చెప్పి ఎన్టీఆర్ రికార్డు క్రియేట్ చేసాడు. తెలుగుతో పాటు తమిళం, కన్నడం, హిందీలో  స్వయంగా తానే డబ్బింగ్ చెప్పి అదరగొట్టాడు… అయితే ఇన్ని భాషలలో ఎన్టీఆర్ డబ్బింగ్..చాలా మంది హీరోలని డిఫెన్స్ లో పడేసింది. ఎన్టీఆర్ ని తక్కువ అంచనా వేసిన వారు  దేవర సినిమా కంటే దేవర సినిమా ప్రమోషన్స్ చూస్తే ఫుల్  క్లారిటీ వస్తుంది.

ప్రస్తుతం టాలీవుడ్ లో ఏ హీరో అయినా సరే పాన్ ఇండియా వైడ్ సినిమా రిలీజ్ చేయాలంటే కచ్చితంగా అక్కడి లోకల్ స్టార్ హీరో సపోర్ట్ ఉండాలి.అప్పుడే అక్కడ సినిమాకు హైప్ వస్తుంది. వేరే హీరోల సపోర్ట్ లేకుండా ప్రమోషన్స్ అసాధ్యం అని చెప్పచ్చు. అలాంటిది అన్ని భాషల్లో దేవర సినిమాకు ఎన్టీఆర్ ఎవరి సపోర్ట్ లేకుండా తానే ప్రమోషన్స్ లీడ్ చేసాడు. ఇక డబ్బింగ్ తో లోకల్ ఇగోని కూడా కాంప్రమైజ్ చేసి భారీ వసూళ్లు సాధించాడు. ప్రస్తుతం ఇదే టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది.ప్రస్తుతం టాలీవుడ్ స్టార్ హీరోలకు ఎన్టీఆర్ రేంజ్ లో సినిమాను ప్రమోట్ చేసే దమ్ము ఉందా అనే చర్చ మొదలయింది. డబ్బింగ్ అన్ని భాషల్లో చెప్పడం అనేది అంత సులువు కాదు. ప్రతి భాషలో ఎన్టీఆర్  ఓ టైం ఫిక్స్ చేసుకుని డబ్బింగ్ ఫినిష్ చేయడం జరిగింది.దీనితో ప్రస్తుతం టాలీవుడ్  హీరోలు అంతా సౌత్ భాషలు నేర్చుకోవడానికి నానా కష్టాలు పడుతున్నారు. మాహేశ్ బాబు, రామ్ చరణ్ వంటి  పాన్ ఇండియా హీరోలు సైతం తమ సినిమాకు తామే డబ్బింగ్ చెప్పేలా  ప్లాన్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: