మెగా బ్రదర్ నాగబాబు కొడుకు వరుణ్ తేజ్ ని పెళ్లి చేసుకొని మెగా ఇంటికోడలుగా అడుగు పెట్టింది లావణ్య త్రిపాఠి. సోషల్ మీడియాలో ఆమెకు సంబంధించిన వార్తలు బాగా ట్రెండ్ అవుతున్నాయి. ఆమె ప్రెగ్నెంట్ అంటూ బాగా ప్రచారం జరిగింది . అయితే దీనిపై ఆమె ఎక్కడా కూడా అఫిషియల్ గా స్పందించకపోవడంతో అదంతా ఫేక్ అంటూ కొట్టి పడేస్తున్నారు జనాలు. రీసెంట్గా లావణ్య త్రిపాఠికి సంబంధించిన ఒక బిగ్ రూమర్ ని బాగా ట్రెండ్ చేస్తున్నారు ఆకతాయిలు . లావణ్య త్రిపాఠి అందాల రాక్షసి అనే సినిమా ద్వారా తెలుగు చలనచిత్ర పరిశ్రమలోకి హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది . ఈ సినిమా మంచి హిట్ అందుకుంది. ఈ సినిమాలో నవీన్ చంద్రతో ఆమె పర్ఫామెన్స్ అదిరిపోయే రేంజ్ లో ఉండింది. అయితే ఇదే మూమెంట్లో నవీన్ చంద్ర ఆమె కెమిస్ట్రీ చూసి ఈ ఇద్దరు ప్రేమించుకుంటున్నారు అంటూ తెగ ప్రచారం చేసేసారు జనాలు .
అయితే దానిపై వాళ్లు ఏ విధంగా కూడా స్పందించలేదు . దీంతో ఇది నిజమే అనుకుంటూ భావించారు . అయితే అదంతా ఫేక్ అంటూ అప్పట్లోనే వాళ్ళ ఫాన్స్ క్లారిటీ ఇచ్చారు. లావణ్య త్రిపాఠి క్యారెక్టర్ అలాంటిది కాదు అని నవీన్ చంద్ర ఆల్రెడీ కమీటెడ్ అని ..వీళ్ళిద్దరికీ ఇలాంటి ఒక రిలేషన్షిప్ అంటగట్టడం చాలా దారుణం అంటూ మండిపడ్డారు . చాలామంది జనాలు అసలు వీళ్ళిద్దరి మధ్య లవ్ ఉందా అంటూ కూడా సందేహపడ్డారు . లావణ్య త్రిపాఠి ఎప్పుడు కూడా చాలా సైలెంట్ గా ఉంటుంది . ఎక్కడా కూడా తన హద్దులు మీరదు. ఆ కారణంగా కూడా లావణ్య త్రిపాఠి సంబంధించి ఈ న్యూస్ అంతా ఫేక్ అంటూ జనాలు నమ్మేశారు . అనుకున్నట్టే లావణ్య త్రిపాఠి ఆ తర్వాత వరుణ్ తేజ్ ని ప్రేమించి పెళ్లి చేసుకుంది . పెళ్లి తర్వాత కూడా ఎక్కడ హద్దులు మీరకుండా మెగా ఫ్యామిలీ సంప్రదాయాన్ని ఇంకా రెట్టింపు అయ్యేలా చేస్తుంది. త్వరలోనే వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి తెరపై ఒక సినిమాలో కనిపించబోతున్నారు అంటూ ప్రచారం జరుగుతుంది..!