చలికాలం వచ్చిందంటే చాలు  చాలామంది హిందువులు  నల్లని వస్త్రాలు ధరించి కఠినమైనటువంటి అయ్యప్ప దీక్షను స్వీకరిస్తారు. ఈ దీక్షలో పేద, ధనిక అనే బేధం లేకుండా  ఎవరికి తోచిన విధంగా వారు దీక్షను స్వీకరించి  అయ్యప్పను నిష్టగా పూజిస్తారు. అలా తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్టార్ ఫ్యామిలీ అయినటువంటి మెగా ఫ్యామిలీలో కూడా  రామ్ చరణ్ అయ్యప్ప దీక్ష ప్రతి ఏడాది చేపడుతూ ఉంటాడు. అలా ఈ ఏడాది కూడా  మెగా హీరో రామ్ చరణ్ అయ్యప్ప మాల స్వీకరించాడు. ఇదే తరుణంలో ఆయన ఒక చిన్న తప్పు చేశాడని సోషల్ మీడియాలో విపరీతంగా విమర్శిస్తున్నారు. ఆయన ఏం చేశాడు ఆ వివరాలు ఏంటో చూద్దాం.. ప్రస్తుతం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గేమ్ చేంజెర్ సినిమా షూటింగ్ పూర్తిచేసుకుని  అయ్యప్ప దీక్షలో ఉన్నాడు.. ఈ సినిమా సంక్రాంతికి రిలీజ్ అవ్వబోతోంది.. 

ఈ చిత్రం తర్వాత బుచ్చిబాబు డైరెక్షన్ లో ఇంకో సినిమా చేయబోతున్నారు. ఈ చిత్రానికి రెహమాన్ సంగీతం అందిస్తున్నారని జాన్వీ కపూర్ హీరోయిన్ గా ఎంపికైనట్టు తెలుస్తోంది.. అలాంటి ఈ తరుణంలో అప్పట్లో రెహమాన్ కి రాంచరణ్ ఒక మాట ఇచ్చారట. ఈ సినిమా మొదలుపెట్టేముందు కడప దర్గాలో  జరిగే 80వ నేషనల్ ముషాయిరా గజల్ ఈవెంట్ కి హాజరుకావాలని కోరారట.. దీంతో రామ్ చరణ్ రెహమాన్ మాట కాదనలేక తాజాగా కడప దర్గాను సందర్శించారు. దీంతో వివాదం రాజుకుంది.. అయితే రామ్ చరణ్ కామన్ గా వెళ్లి దర్గాని సందర్శిస్తే ఇబ్బంది ఏమీ లేదు కానీ ఆయన ఎంతో నిష్టతో పూజించే అయ్యప్ప మాల వేసి  దర్గాను సందర్శించడంతో కొంతమంది హిందూ భక్తులు విమర్శిస్తున్నారు..

  సాధారణంగా అయ్యప్ప మాలలో శవం ఎదురు వస్తేనే మళ్లీ స్నానం చేసి పీఠాన్ని పూజించి బొట్టు పెట్టుకుంటారు.  అలాంటిది ముస్లిం దర్గా అంటే అప్పటి ముస్లిం పెద్దలలో మరణించిన వారి సమాధి.. ఈ మాలలో ఉండి ఆ సమాధిని సందర్శించడం పద్ధతి కాదంటూ కొంతమంది హిందూ భక్తులు విమర్శిస్తున్నారు.. మరి కొంతమంది తప్పనిసరిగా శబరిమలై వెళ్లేవారు వావర్ స్వామి దర్గాను సందర్శిస్తారని, దర్గాను సందర్శించగా లేని ఇబ్బంది కడప దర్గాను సందర్శిస్తే ప్రాబ్లం ఏంటంటు ప్రశ్నిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: