సమంత ఫైనాన్షియల్ స్టేటస్ గురించి సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు వార్తలు వైరల్ అవుతూనే ఉంటాయి . ఆమె అటువంటి ప్రాబ్లం ఏమీ లేదు అని సమంతానే స్వయంగా చెప్పిన కూడా కొంతమంది జనాలు మాత్రం ఆమె ఫైనాన్సియల్  స్టేటస్ గురించి ఏదో ఒక రకంగా మాట్లాడుకుంటూ ఉంటారు . దానికి ముఖ్య కారణం ఆమె సింగిల్ గా ఉండడమే . నిజానికి సమంత పెద్ద బ్యాక్ గ్రౌండ్ నుంచి వచ్చిన హీరోయిన్ ఏమి కాదు . మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అని చెప్పాలి.


ఆమె ఇండస్ట్రీలోకి వచ్చాకే డబ్బులు సంపాదించడం స్టార్ట్ చేసింది . ఇక అక్కినేని నాగచైతన్య పెళ్లి చేసుకున్నాక అక్కినేని ఇంటికి కోడలు ట్యాగ్ వేయించుకొని బాగానే సంపాదించుకుంది అంటూ జనాలు మాట్లాడుకున్నారు. అయితే ఇప్పుడు సమంత పేరుకు ముందు అక్కినేని టాయ్గ్ లేదు . ఆమె నాగచైతన్య కి విడాకులు ఇచ్చేసింది . ఇప్పుడు అందరి ఫోకస్ సమంత పైన పడింది . సమంత సినిమాలలో కూడా ఎక్కువగా నటించడం లేదు . నిన్నకాక మొన్న  రిలీజ్ అయిన సిటాడిల్ వెబ్ సిరీస్ కూడా ప్లాప్ అయిపోయింది . ఇప్పుడు సమంత ఖాతాలో పెద్దగా చెప్పుకోతగ్గ సినిమాలు ఏమీ లేవు .  ఆమెకి మూడు కోట్లు నాలుగు కోట్లు ఇస్తారే కానీ ఎక్కువ ఎక్కువ పారితోషకం ఇచ్చే సాహసం జనాలు చేయడం లేదు . అయితే ఇప్పుడు సమంత డబ్బు సంపాదించుకోవడానికి కొత్త మార్గాన్ని ఎంచుకుంది అంటూ ప్రచారం జరుగుతుంది .



ఇప్పటికే సమంత సాకీ అంటూ బిజినెస్ స్టార్ట్ చేసింది . ఇంస్టాగ్రామ్ ద్వారా కూడా ఆమెకు పలు రకాలుగా డబ్బులు వస్తాయి . అడపాదడప ప్రమోషన్స్ డబ్బులు కూడా వస్తాయి . ఇప్పుడు సమంత ఫుడ్ బిజినెస్ లో వేలు పెట్టాలి అనుకుంటుందట.  ఆల్రెడీ నాగచైతన్యతో కలిసి ఉన్నప్పుడు నాగ్ మామ దగ్గర నుంచి కొంచెం అవగాహన పొందిందట.  ఇప్పుడు ఆమె ఏకంగా ఫుడ్ బిజినెస్ స్టార్ట్ చేయాలి అంటూ ప్లాన్ చేస్తుందట . తన ఫుడ్ బిజినెస్ ముంబై లోనే స్టార్ట్ చేయబోతుందట.  దీనికి సంబంధించిన వార్త ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతుంది . తప్పుడు పని చేయకుండా ఏ పని చేసిన సరే డబ్బులు సంపాదించుకోవచ్చు అందులో ఏమాత్రం సిగ్గుపడాల్సిన పనిలేదు ..ఆల్ ద బెస్ట్ సమంత అంటూ సమంత ఫ్యాన్స్ ప్రోత్సహిస్తున్నారు. దీంతో సోషల్ మీడియాలో సమంత పేరు మారిమ్రోగిపోతూ బాగా ట్రెండ్ అవుతుంది..!

మరింత సమాచారం తెలుసుకోండి: