నాగేశ్వరరావు మనవడిగా అక్కినేని నాగార్జున కొడుకుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన నాగచైతన్య సినిమాల పరంగా హిట్టు అందుకుంది చాలా తక్కువ. కానీ వ్యక్తిగతంగా మాత్రం హ్యుజ్ రేంజ్ లో ట్రోల్లింగ్ కి గురవుతూ వచ్చాడు. మరి ముఖ్యంగా నాగచైతన్య సమంతకు విడాకులు ఇచ్చి ఇప్పుడు శోభితా ధూళిపాళ్ళను పెళ్లి చేసుకోబోతూ ఉండడంతో జనాలు ఆయన పై స్పెషల్ ఫోకస్ కూడా చేశారు . కాగా డిసెంబర్ 4వ తేదీ 8:13 నిమిషాలకు వీళ్ళ పెళ్లి అన్నపూర్ణ స్టూడియోస్ లో ఘనంగా జరగబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి .
అంతేకాదు దీనికి సంబంధించిన పెళ్లి కార్డు కూడా సోషల్ మీడియాలో లీకై వైరల్ గా మారింది. ఇప్పుడు వీళ్ళ హనీమూన్ కి సంబంధించిన విషయం బయటకు వచ్చింది . నాగచైతన్య అప్పుడే హనీమూన్ కి సంబంధించిన టికెట్ బుక్స్ చేసేసారట . అందుతున్న సమాచారం ప్రకారం వైరల్ అవుతున్న న్యూస్ ప్రకారం .. శోభిత ధూళిపాళ్ల - నాగచైతన్య లు మాల్దీవ్స్ కి హనీ మూన్ కి వెళ్లడానికి టికెట్స్ బుక్ చేసుకున్నారట . దాదాపు పది రోజులపాటు అక్కడే హనీమూన్ ను సెలబ్రేట్ చేసుకోబోతున్నారట . దీంతో నాగచైతన్య పేరు సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతుంది. నాగచైతన్య టూ రొమాంటిక్ అంటూ జనాలు రకరకాలుగా మాట్లాడుతున్నారు..!