-చందమామను విలన్ గా యాక్సెప్ట్ చేయని అభిమానులు...
- సీత మూవీ కి కాజల్ పాత్ర మైనస్..

 చందమామ మూవీ తో ఇండస్ట్రీలో చందమామగా మారిపోయిన కాజల్ అగర్వాల్ ఏ సినిమాలో చూసినా కూడా చాలా అందంగా ఆకర్షణీయం గా కనిపిస్తుంది. అయితే అలాంటి ఈ ముద్దుగుమ్మని డైరెక్టర్ తేజ నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో తీసుకొని సీత మూవీలో చూపించినప్పటికీ సినిమా అంతగా ఆకట్టుకోలేదు.మరి సీత మూవీకి కాజల్ విలనిజం ఎలా మైనస్ అయిందో ఇప్పుడు చూద్దాం..

 విలన్ గా కాజల్:

 తేజ దర్శకత్వంలో సుంకర రామబ్రహ్మం నిర్మాతగా తెరకెక్కిన సీత మూవీ 2019 మే 24 న విడుదలై అట్టర్ ప్లాప్ అయ్యింది. అయితే భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమాలో హీరోగా బెల్లంకొండ శ్రీనివాస్ హీరోయిన్ గా..కాజల్ అగర్వాల్ చేశారు. ఇక ఈ సినిమాలో అమాయకమైన పాత్రలో హీరో బెల్లంకొండ శ్రీనివాస్ నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కాజల్ అగర్వాల్ కనిపించారు. అయితే ఈ మూవీలో హీరో అయినా బెల్లంకొండ శ్రీనివాస్ కి అమాయకపు పాత్ర సెట్ అవ్వలేదు.అలాగే గ్లామర్ క్వీన్ అయినటువంటి కాజల్ అగర్వాల్ నెగిటివ్ షేడ్స్ అస్సలు మ్యాచ్ అవ్వలేదు. దీంతో ఈ సినిమా మొదటి రోజే ప్లాఫ్ టాక్ తెచ్చుకుంది.


ఈ సినిమాలో ఆస్తికోసం ఎంతకైనా తెగించడానికి రెడీగా ఉంటుంది కాజల్ అగర్వాల్..కానీ బెల్లంకొండ శ్రీనివాస్ మాత్రం అమాయకంగా కాజల్ అగర్వాల్ ని నమ్ముతూ ఉంటాడు.. ఇక విలన్ పాత్రలో నటించిన సోనుసూద్ ఎలాగైనా కాజల్ అగర్వాల్ ని అనుభవించాలి అనే కసితో ఉంటాడు.అలా సాగిన ఈ కథనం రోటిన్ గా ఉండడంతో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ అయింది. అయితే సీత మూవీలో నెగటివ్ షేడ్స్ ఉన్న పాతలో ఉన్న కాజల్ తనకి హిట్ పడుతుంది అనుకున్నప్పటికీ తన పాత్రతోనే ఈ సినిమాకి మైనస్ అయింది. ముఖ్యంగా ఈ సినిమాలో హీరో హీరోయిన్ ఇద్దరు పాత్రలు మూవీకి మైనస్ అయ్యాయి అని చెప్పుకోవచ్చు. అలా విడుదలైన సీత మూవీ ఫ్లాప్ అయింది

మరింత సమాచారం తెలుసుకోండి: