మంగళవారం జరగనున్న విచారణకు హాజరు కావాలని పోలీసులు ఆర్జీవికి నోటీసులు అందించారు. అయితే మంగళవారం పోలీసుల విచారణకు ఆర్జీవి హాజరు కాలేకపోయాడు. అదే సమయంలో మంగళవారం ఉదయం 11 గంటలకు ఆర్జీవి తరపున న్యాయవాది పోలీసుల వద్దకు వెళ్లారు. షూటింగ్ లో బిజీగా ఉన్న కారణంగా హాజరు కావడం లేదని, కనీసం వారం సమయం ఇవ్వాలంటూ ఆర్జీవి పంపిన లేఖను న్యాయవాది పోలీసులకు అప్పగించారు.
మరోవైపు రాంగోపాల్ వర్మ మంగళవారం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పోలీసులు అరెస్టు చేసి థర్డ్ డిగ్రీ ప్రయోగించే ప్రమాదం ఉన్నట్లుగా పిటిషన్ లో పేర్కొన్నారు. అందువల్ల తనపై నమోదు చేసిన కేసులో హైకోర్టులో పిటిషన్ వేశారు వర్మ. ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ పిటిషన్ వేశారు వర్మ. వ్యూహం సినిమా ప్రమోషన్లలో భాగంగా ఎక్స్ లో కూటమి నేతలపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ కేసు పెట్టారు మద్దిపాడు మండల టిడిపి ప్రధాన కార్యదర్శి ఎం.రామలింగం.
మద్దిపాడు పోలీసులకు మద్దిపాడు మండల టిడిపి ప్రధాన కార్యదర్శి ఎం.రామలింగం.... ఫిర్యాదు చేయడంతో వర్మపై ఐటీ యాక్ట్ కింద ఈ నెల 10న ప్రకాశం జిల్లా మద్దిపాడు పోలీసులు కేసు నమోదు చేశారు. ఇక ఈ కేసు ఇప్పుడు దర్యాప్తులో ఉంది.. కాగా, వర్మ కోర్టుకు హాజరు కాకపోవడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారుతోంది.