అప్పుడే సూపర్ స్టార్ కృష్ణ కూడా ఈ కథ వినిపించారట . కానీ సూపర్ స్టార్ కృష్ణకు ఈ కథ ఎక్కడో మహేష్ బాబు క్యారెక్టర్ కి సూట్ కాదు అనిపించిందట . అప్పుడే రాజకుమారుడు సినిమాతో సూపర్ డూపర్ హిట్టు అందుకున్న మహేష్ బాబు ఇలాంటి ఒక సినిమా చేస్తే ఎక్కడ ఆయన కెరియర్ పై నెగిటివ్ ఇంప్రెస్ పడుతుందో అన్న భయంతో ఈ స్టోరీని రిజెక్ట్ చేశారట . ఆ తర్వాత ఈ స్టోరీ తారక్ వద్దకు వెళ్ళింది. తారక్ ఈ సినిమాని ఓకే చేసి తన ఖాతాలో వేసుకున్నాడు.
ఆ తర్వాత చాలా సందర్భాలలో ఈ విషయాన్ని బయటపెట్టారు రాజమౌళి . ఈ సినిమా రాజమౌళి - ఎన్టీఆర్ తో తెరకెక్కించి మంచి పని చేశాడు అని.. ఒకవేళ మహేష్ బాబుతో తెరకెక్కించి ఉంటే అనుకున్నంత హిట్ అయి ఉండేది కాదో ఏమోనని చాలామంది జనాలు సందేహపడ్డారు. మొత్తానికి ఎవరి ఖాతాలో ఎప్పుడు ఎలాంటి హిట్ పడాలో ఆ దేవుడు ముందే నిర్ణయిస్తాడు అన్నదానికి ఇది కూడా మరో బిగ్ ఎగ్జాంపుల్ . మహేష్ బాబు తన కెరియర్ లో ఎన్నో మంచి మంచి సినిమాలను మిస్ చేసుకున్నాడు. వాటిల్లో ఒకటే ఈ స్టూడెంట్ నెంబర్ వన్ అంటూ జనాలు కూడా మాట్లాడుకుంటున్నారు.
ప్రెసెంట్ రాజమౌళి మహేష్ బాబు తో ఓ బిగ్ అడ్వెంచర్స్ మూవీ తెరకెక్కించడానికి భారీ స్థాయిలో కష్టపడుతున్నారు . గ్లోబల్ స్థాయిలో ఈ సినిమా పాపులారిటీ సంపాదించుకోవడం పక్క అంటూ ఫిక్స్ అయిపోయారు మహేష్ బాబు అభిమానులు..!