కొన్ని సంవత్సరాల క్రితం టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున హీరోగా త్రిష హీరోయిన్గా శ్రీను వైట్ల దర్శకత్వంలో కింగ్ అనే సినిమా రూపొందిన విషయం మన అందరికీ తెలిసిందే. శ్రీహరి ఈ సినిమాలో ఓ కీలకమైన పాత్రలో నటించగా ... మమతా మోహన్ దాస్ ఈ మూవీ లో నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించింది. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ మూవీ కి కోనా వెంకట్ , గోపీ మోహన్ కథను అందించారు. ఇక భారీ అంచనాల నడుమ 2008 వ సంవత్సరం డిసెంబర్ 25 వ తేదీన విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది.

ఇది ఇలా ఉంటే తాజాగా కోన వెంకట్ ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు. అందులో భాగంగా కింగ్ సినిమా ప్రేక్షకులను పెద్ద స్థాయిలో ఆకట్టుకోకపోవడానికి గల కారణాలను తెలియజేశారు. తాజా ఇంటర్వ్యూలో కోనా వెంకట్ మాట్లాడుతూ ... కింగ్ సినిమా మొదటి భాగం బాగానే ఉన్నప్పటికీ రెండవ భాగం వల్లే ఆ సినిమా ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేదు. సెకండ్ హాఫ్ కాస్త లెంగ్త్ ఎక్కువ అయిన ఫీలింగ్ జనాలకు వచ్చింది.

అలా సెకండ్ హాఫ్ ఫస్టాఫ్ తో పోలిస్తే స్లో కావడం , అలాగే ముఖ్యంగా సినిమా సెకండ్ హాఫ్ లో బొట్టు శీను , కింగ్ క్యారెక్టర్లు అనవసరమైన కన్ఫ్యూజన్ ని క్రియేట్ చేశాయి అని వాటి వల్ల ఈ సినిమాకి ఫ్లాప్ టాక్ వచ్చింది అని , అలాగే స్క్రీన్ ప్లే కూడా బాగో లేకపోవడం వల్ల ఈ మూవీ ఫ్లాప్ అయ్యింది అని కొన వెంకట్ చెప్పాడు. అలాగే సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఫ్లాప్ అయినప్పటికీ ఈ మూవీ లో నాగార్జున , బ్రహ్మానందం మధ్య వచ్చే కామెడీ సీన్స్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి అని , అలాగే ఈ మూవీ లోని పాటలు కూడా ఎంతగానో ప్రేక్షకులను అలరించాయి అని కోన వెంకట్ తాజా ఇంటర్వ్యూలో భాగంగా చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: