త్రిబుల్ ఆర్ తర్వాత గ్లోబల్ హీరోగా భారీ క్రేజ్ తెచ్చుకున్న రామ్‌చరణ్ దగ్గర నుంచి సోలో హీరోగా వస్తున్న మూవీ గేమ్ ఛేంజర్ .. సౌత్ స్టార్‌ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో తెర్కక్కుతున్న ఈ సినిమా వచ్చే సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ సినిమా చాలా సార్లు వాయిదా పడుతూ వచ్చింది. ఇక ఇప్పుడు ఈ సినిమాని సంక్రాంతికి విడుదల చేయబోతున్నట్టు చిత్ర యూనిట్ కూడా ప్రకటించింది. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ చివరి దసుకు వచ్చింది. ఈ సినిమా నుంచి వచ్చిన టీజర్ , ట్రైలర్ కూడా ప్రేక్షకులకు సినిమా పై అంచనాలు పెంచేసాయి . ఈ సినిమాతో శంకర్ కం బ్యాక్ ఇస్తారని సిని విశ్లేషకులు కూడా భావిస్తున్నారు.


అలానే ఈ నెల 17 నుంచి విజయవాడలో దర్శకుడు శంకర్ కొన్ని కీలక సన్నివేశాలను తెర్కక్కించబోతున్నాడు. అయితే అదే సమయంలో మరో యూనిట్ తో కూడా హైదరాబాదులో షూటింగ్ జరుపుతున్నారు. ఆ యూనిట్‌కు స్వామి రారా ఫ్రేమ్ సుధీర్ వర్మ నిర్దేశకుడుగా ఉన్నట్టు తెలుస్తుంది. ఇంతకు ముందు రెండో యూనిట్‌క‌రు హిట్ సినిమా దర్శకుడు శైలేష్ కోలను ఈ సినిమాకు సంబంధించిన కొన్ని సీనులను డైరెక్ట్ చేసిన విషయం తెలిసిందే . ఈనెల 18 నుంచి సుదీర్ వర్మ దర్శకత్వంలో కొన్ని కీలక సన్నివేశాలను హైదరాబాదులో తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తుంది .


అలానే త్వరలోనే పాన్ ఇండియా లెవెల్ లో మరికొన్ని ముఖ్య ప్రాంతాల్లో ప్రమోషన్స్ కోసం చిత్ర యూనిట్ పర్యటించడానికి రెడీ అవుతుంది. భారీ పొలిటికల్ డ్రామాగా వస్తున్న ఈ సినిమాలో రామ్ చరణ్ ద్విపాత్ర అభినయంలో కనిపించబోతున్నాడు. ఎలక్షన్ ఆఫీసర్గా చరణ్ పాత్ర ఎంతో పవర్ఫుల్ గా ఉంటుందని తెలుస్తుంది .. అలాగే శ్రీకాంత్ ముఖ్యమంత్రి పాత్రలో నటిస్తున్నారు.  ఇక ఈ సినిమాకి తమన్ సంగీతం అందించాడు. ఇక మారి ఈ సినిమాతో రామ్ చరణ్ - శంకర్ ఎలాంటి సంచలనాలు అందుకుంటారో చూడాలి .

మరింత సమాచారం తెలుసుకోండి: