తెలుగు సినీ పరిశ్రమలో దర్శకుడిగా మంచి గుర్తింపును సంపాదించుకున్న వారిలో అనిల్ రావిపూడి ఒకరు. ఈయన కెరియర్ ప్రారంభంలో చాలా సినిమాలకు కథ రచయితగా పని చేసి ఆ తర్వాత పటాస్ సినిమాతో దర్శకుడుగా కెరియర్ను ప్రారంభించాడు. తాజాగా ఈయన ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు. అందులో భాగంగా సప్తగిరి గురించి కొన్ని ఆసక్తికరమైన వివరాలను తెలియజేశాడు. తాజా ఇంటర్వ్యూలో భాగంగా అనిల్ రావిపూడి మాట్లాడుతూ ... నేను , రామ్ పోతినేని హీరోగా రూపొందిన కందిరీగ సినిమాకు కథా రచయితగా పని చేశాను.

అందులో నేను నటించడం కోసం ఒక పాత్రను రాసుకున్నాను. కానీ కొన్ని కారణాల వల్ల అందులో సప్తగిరి నటించాడు. దానివల్ల ఆయనకు మంచి పేరు వచ్చింది. సప్తగిరి నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్. కానీ ఇప్పటి వరకు ఆయన నేను తీసిన ఒక్క సినిమాలో కూడా నటించలేదు. అందుకు ప్రధాన కారణం ఆయనే. కొంత కాలం క్రితం నాకు సప్తగిరి ఫోన్ చేసి నాకు సినిమాలో ఏదైనా పాత్ర రాస్తున్నావా అని అడిగాడు. అలాగే ఏదైనా పాత్ర రాస్తే అది సినిమా మొత్తం ఉండేలా రాయి. ఏదో చిన్న పాత్ర అసలు వద్దు అని అన్నాడు. దానితో ఇప్పటివరకు ఫుల్ లెన్త్ పాత్ర ఏది సప్తగిరికి రాయడం కుదరలేదు. అందుకే ఆయన ఇప్పటివరకు నేను దర్శకత్వం వహించిన ఏ సినిమాలో కూడా లేడు.

సప్తగిరి కనుక ఏ పాత్ర అయినా సరే చేస్తాను , ఎంత చిన్నది అయినా చేస్తాను అని ఉంటే ఇప్పటివరకు నేను దర్శకత్వం వహించిన చాలా సినిమాల్లో ఆయన కనిపించేవాడు. అందుకే ఇప్పటివరకు నేను తీసిన ఏ సినిమాలో కూడా సప్తగిరి లేడు అని చెప్పుకొచ్చాడు. ఇది ఇలా ఉంటే అనిల్ రావిపూడి ప్రస్తుతం వెంకటేష్ తో సంక్రాంతికి వస్తున్నాం సినిమాను రూపొందిస్తున్నాడు. ఈ మూవీ ని వచ్చే సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల చేయనున్నట్లు మేకర్స్ ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: