ఇక ఆ తర్వాత ఆమె రాజశేఖర్‌తో గోరింటాకు అనే సినిమాలో కూడా నటించి మంచి పేరు తెచ్చుకుంది. అయితే తాను అధిక బరువు కారణంగా సర్జరీ చేయించుకునే క్రమంలో ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయింది. ఆ సమయంలో తరుణ్ కి కూడా హీరోగా అవకాశాలు పెద్దగా లేకపోవడంతో ఇండస్ట్రీ నుంచి కూడా ఫీడ్ అవుట్ అయిపోయాడు. ఒక విధంగా చెప్పాలంటే తరుణ్ కెరియర్ నాశనం అవడానికి కారణం ఆయన ప్రేమ వ్యవహారమే ఇద్దరు ప్రేమించుకున్నప్పుడు ఇంట్లో వాళ్ళు ఒప్పుకోకపోతే బయటకు వచ్చేసి పెళ్లి చేసుకోవచ్చు కదా అని అప్పట్లో చాలామంది తరుణ్ మీద నెగిటివ్ కామెంట్లు కూడా చేశారు. ఆ కారణంగానే ఆయన చేసిన సినిమాలు చూడడానికి కూడా చాలా మంది ప్రేక్షకులు ఇష్టపడలేదు.
ఇలా తన పర్సనల్ లైఫ్ లో జరిగిన ఇష్యూస్ వల్ల తరుణ్ ప్రేక్షకల్లో చాలా బ్యాడ్ అయిపోయాడు .. దాంతో ఆయన ఇండస్ట్రీలో చాలా వరకు తన క్రేజ్ ని కోల్పోయాడు. దానికి తోడు ఆయనకు మంచి సినిమాలు పడకపోవడంతో ఆయన ఫేడ్ అవుట్ అయిపోయాడు. ప్రస్తుతం ఆయన ఇండస్ట్రీలో తన సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేద్దామని చూస్తున్నప్పటికీ ఆనకు అంతమంచి క్యారెక్టర్లు అయితే రావడం లేదు. అందుకు తగినట్టుగానే ఇప్పుడు తరుణ్ ని స్క్రీన్ మీద చూసే ప్రేక్షకులు కూడా ఎవ్వరూ లేరని.. చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు. వాస్తవానికి ఆయన అప్పుడు జాగ్రత్తగా సినిమాలు చేసుకుంటే.. తను స్టార్ హీరోగా ఇండస్ట్రీలో ఉండేవాడు