విక్టరీ వెంకటేష్ ఎక్కువగా.. కామెడీ జోనర్ సినిమాలు చేసి సక్సెస్ అయ్యాడు. మల్లీశ్వరీ, ఆడవారి మాటలకు అర్థలే వేరులే, నువ్వు నాకు నచ్చావ్ ఇలాంటి ఎన్నో సినిమాలు చేసి.. విక్టరీ వెంకటేష్.. తన ఇంటి పేరు విక్టరీ గా మార్చుకున్నాడు. అయితే గతంలో కమెడియన్ ఆలీ నటించిన సినిమాను రీమేక్ చేసి విక్టరీ వెంకటేష్ బొక్క బోర్లా పడ్డాడు. ఆలీ కెరీర్ లో మెమోరబుల్ హిట్ గా నిలిచిన యమలీల సినిమాను వెంకటేష్ హిందీలో తక్దీర్ వాలగా రీమేక్ చేశారు.
ఆలీకి మంచి హిట్ ఇచ్చిన ఈ సినిమా వెంకటేష్ కు మాత్రం సక్సెస్ ఇవ్వలేదు. వెంకటేష్ తండ్రి రామానాయుడు ఈ సినిమాను నిర్మించారు. తెలుగులో ఎస్వి కృష్ణారెడ్డి ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. హిందీలో మాత్రం మురళీ మోహనరావు దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. కానీ కృష్ణారెడ్డి తరహాలో ఆయన మ్యాజిక్ క్రియేట్ చేయలేకపోయాడు. ఈ సినిమాలో వెంకటేష్ సరసన రవీనా హీరోయిన్ గా చేసింది.
యమలీల సినిమాలో అత్యంత కీలకమైన రాజు పాత్రని కైకాల సత్యనారాయణ పోషించారు. అలాంటి పాత్రలలో మెప్పించడం కైకాల సత్యనారాయణకు వెన్నతో పెట్టిన విద్య లాంటిది. యముడి పాత్రలో కైకాల సత్యనారాయణ అద్భుతంగా నటించారు. యమలీల సినిమా ఆలీకి ఎంతో సక్సెస్ ఇచ్చినప్పటికీ విక్టరీ వెంకటేష్ కు మాత్రం సక్సెస్ ఇవ్వలేకపోయింది. అంత గొప్ప పేరు, ప్రతిష్టలు ఉన్నప్పటికీ ఈ సినిమా వెంకటేష్ ను కాపాడలేకపోయింది.