యాంకర్ అనసూయ గురించి తెలియని వారంటూ ఉండరు. జబర్దస్త్ షో ద్వారా పరిచయమైన ఈ చిన్నది అతి తక్కువ సమయంలోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈ షోలో తన అద్భుతమైన నటనకు గాను ఎన్నో రకాలుగా సినిమా అవకాశాలు వచ్చాయి. అంతేకాకుండా యాంకర్ గా, జడ్జిగా ఆఫర్లు సైతం వచ్చాయి. దీంతో అనసూయ వచ్చిన అవకాశాలు అన్నిటినీ సద్వినియోగం చేసుకుంది.


అనంతరం సినిమాల మీద ఆసక్తితో సినిమా ఇండస్ట్రీ వైపుకు మళ్ళింది. రంగస్థలం సినిమాలో రంగమ్మత్తగా మంచి పాత్రను పోషించి ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంది. ఈ సినిమాలో తన అద్భుతమైన నటనను చూసిన దర్శక నిర్మాతలు అనసూయకు వరుసగా సినిమా అవకాశాలు ఇస్తున్నారు. ప్రస్తుతం ఇండస్ట్రీలో అనసూయ బిజీ ఆర్టిస్ట్ గా మారిపోయింది. ఓవైపు సినిమాలు, మరోవైపు షోలలో జడ్జిగా వ్యవహరిస్తూ బిజీగా ఉంటుంది.


అనసూయ సోషల్ మీడియాలో యమ యాక్టివ్ గా ఉంటుందన్న సంగతి తెలిసిందే. ప్రతి ఒక్కరూ ఈ బ్యూటీని ఫాలో అవుతారు. ఎందుకంటే ఈ అమ్మడు సోషల్ మీడియాలో పోస్ట్ చేసే ఫోటోలు కుర్రాళ్ళ మతులు పోగొడతాయి. తాను పోస్ట్ చేసే ఫోటోలకు లైక్స్, కామెంట్లు భారీగా వస్తాయి. ఇదిలా ఉండగా.... ప్రస్తుతం అనసూయకు ఓ వ్యక్తి ఫోన్ చేసి తరచూ ఇబ్బంది పెడుతున్నారట. అర్ధరాత్రి సమయంలో అనసూయకు ఫోన్లు చేసి నీ రేటు ఎంత చెప్పు అని అడుగుతున్నాడట.


అనసూయ ఆ వ్యక్తి నెంబర్ బ్లాక్ చేసినప్పటికీ పదేపదే ఇతరుల ఫోన్స్ నుంచి ఫోన్లు చేసి అనసూయను చాలా ఇబ్బంది పెట్టడమే కాకుండా చాలా విసిగిస్తున్నారట. ఈ విషయం అనసూయ సన్నిహితుల ద్వారా వెలుగులోకి వచ్చింది. దీంతో ఈ వార్త ఒక్కసారిగా హాట్ టాపిక్ అవుతుంది. ఇది ఇలా ఉండగా.. టాలీవుడ్‌ స్టార్‌ యాంకర్‌, అనసూయ ఇప్పుడు సినిమాలతో బిజీగా ఉంది. ఆమె నటించిన పుష్ప 2 త్వరలోనే రిలీజ్‌ కానుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: