సినిమాలకు .. రాజకీయాలకు పెద్దగా దూరం లేదు. తెలుగు నాట రెండు కలిసిపోయి ఉన్నాయి. అందువల్ల ఎప్పుడు ఏ సినిమా రిలీజ్ అయినా ? యునానమస్ బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకోవాలి .. లేదంటే ట్రోలింగ్ అని ఆయుధం పట్టుకుని సోషల్ మీడియాలో రెడీగా ఉంటున్నారు. సోషల్ మీడియాలో ఉంటే పొలిటికల్ పార్టీల మద్దతుదారులు కూడా అందులో భాగంగానే ఉంటారు. పుష్ప 2 పరిస్థితి ఇప్పుడు ఇలాగే ఉంది. పుష్ప 2 ఏమాత్రం తేడాగా ఉన్న ఆడుకోవడానికి చాలా మంది సిద్ధంగా ఉన్నారు. రాజకీయంగా తెలుగుదేశం - జనసేన రెండు ఇప్పుడు బన్నీ పుష్ప 2 సినిమాకు శత్రువులే.. ఇలా ఎందుకు అంటేనే కారణాలు కొత్తగా చెప్పక్కర్లేదు. ఎన్నికల ముందు జరిగిన సంగతులు అందరికీ తెలిసిందే కూడా.. !
పుష్ప 2 సినిమా విషయంలో వీరందరూ చాలా యాంటీ గానే ఉన్నారు. అదే టైంలో వైసీపీ ఫ్యాన్స్ నుంచి బాగానే సపోర్ట్ దక్కుతోంది. అందులోను ఎన్నికలకు ముందు బన్నీ వైసీపీలో ఉన్న తన స్నేహితుడికి సపోర్ట్ చేయడానికి వెళ్లిన సంగతి తెలిసిందే. ఇటు మెగా అభిమానులలో రామ్ చరణ్ - చిరంజీవి - పవన్ కళ్యాణ్ ముగ్గురు అభిమానులు కూడా పుష్ప 2 రిజల్ట్ కోసం ఆసక్తితో ఎదురు చూస్తున్నారు. సినిమా రిజల్ట్ తేడా కొడితే మీరు ట్రోలింగ్ కు సిద్ధంగా ఉన్నారు. ఇక మహేష్ బాబు ప్రభాస్ అభిమానులు కూడా ఈ సినిమా రిజల్ట్ కోసం ఎదురు చూస్తున్నారు. అయితే మొన్న అన్స్టాప బుల్ షోలో మహేష్ - ప్రభాస్ మీద బన్నీ పొగడ్తల వర్షం కురిపించాడు. మరి అవి ఏమైనా పని చేస్తాయేమో చూడాలి. ఏది ఏమైనా ట్రోలింగ్ కూడా చిత్తుచిత్తు చేసే అంత సూపర్ హిట్ .. యునానిమస్ పాజిటివ్ టాక్ పుష్ప 2 తెచ్చుకోవాల్సి ఉంది.