టాలీవుడ్ లో విభిన్నమైన పాత్రలలో నటిస్తున్న నటుడు శ్రీకాంత్ అయ్యంగార్.. 54 ఏళ్ళ వయసులో పెళ్లి ప్రకటన చేయడంతో ఒక్కసారిగా ఆశ్చర్యపోతున్నారు. తన ఇంస్టాగ్రామ్ లో నటి జ్యోతి తో ముద్దు పెడుతున్న ఒక ఫోటోను షేర్ చేయడంతో ఈ విషయం వైరల్ గా మారుతున్నది.. ముఖ్యంగా ఈ ఫోటోకి క్రష్ ఆఫ్ మై లైఫ్ అంటూ ఒక కొటేషన్ ని కూడా షేర్ చేయడం జరిగింది. దీన్ని బట్టి చూస్తే త్వరలోనే వీరిద్దరు వివాహం చేసుకోబోతున్నారంటూ పలువురు నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
నిరంతరం వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేస్తూ పోస్టులు పెడితే వార్తలలో ఉంటారు శ్రీకాంత్ అయ్యంగార్. ప్రస్తుతం చాలా ఇండస్ట్రీలలో యంగ్ హీరోలు హీరోయిన్స్ సైతం వివాహం చేసుకోకుండా కెరియర్ మీరు దృష్టి పెడుతూ ఉన్నప్పటికీ కానీ నరేష్, శ్రీకాంత్ వంటి వారు మాత్రం ఈ వయసులో కూడా ప్రేమలు పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. అయితే శ్రీకాంత్ అయ్యంగార్ వివాహం చేసుకోవడంలో తప్పు లేదని.. ఈ వయసులో కచ్చితంగా తోడు కావాలి అని వీరి బంధం చిలకాలంగా ఉండాలని అభిమానులు కోరుకుంటున్నారు. మొత్తానికి శ్రీకాంత్ అయ్యంగార్ త్వరలోనే నటి జ్యోతిని వివాహం చేసుకోబోతున్నారని వార్తలు అయితే వినిపిస్తున్నాయి. మరి ఈ విషయం పైన ఎవరి క్లారిటీ ఇస్తారో చూడాలి.