పాన్ ఇండియా డైరెక్టర్ జక్కన్న ఎన్నో సందర్భాలలో తారక్ ని పొగిడారు. మరి ముఖ్యంగా వీళ్ళిద్దరి కాంబోలో వచ్చిన అన్ని సినిమాలు సూపర్ డూపర్ హిట్ అవ్వడం అభిమానులకి కూడా ఫుల్ హ్యాపీనెస్ క్రియేట్ చేసింది. వార్ 2 సినిమా షూటింగ్లో బిజీగా ఉన్న తారక్ త్వరలోనే దేవర 2 ని సెట్స్ పై కి తీసుకోరాబోతున్నాడు . అయితే "తారక్ తన కెరియర్ లో ఓ సినిమా షూటింగ్ టైంలో మాత్రం ప్లీజ్ నావల్ల కాదు సార్ ఇక ఈ సినిమా కీ ఈ సీన్ నే ఫైనలైజ్ చేసేయండి" అంటూ డైరెక్టర్ని వేడుకున్నారట. ఆ మూవీ మరేదో కాదు "బృందావనం".
ఈ సినిమాలో కాజల్ హీరోయిన్గా నటించింది . సమంత మరొక హీరోయిన్గా నటించింది. ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది . అయితే ఈ సినిమాలో బ్రహ్మానందం కామెడీ టైమింగ్ వేరే లెవెల్ లో ఉంటుంది . మరి ముఖ్యంగా తారక్ కీ డూప్లికేట్ తండ్రిగా నటించే పాత్రలో బ్రహ్మానందం లీనమైపోయాడు . ఓ సీన్లో రూమ్లో బ్రహ్మానందం-తారక్ పై మాత్రమే సీన్స్ తెరకెక్కించే మూమెంట్స్ లో డైరెక్టర్ .."ఇక నా వల్ల కాదు.. బ్రహ్మానందం గారిని చూస్తుంటేనే నవ్వొస్తుంది ..ఈ సీరియస్ డైలాగ్స్ నేను చెప్పలేను ..ఇదే ఫైనలైజ్ చేసేయండి " అంటూ తారక్ రిక్వెస్ట్ చేశారట . డైరెక్టర్ కూడా తారక్ ను తారక్ పొజిషన్ చూసి నవ్వుకొని ఓకే ఓకే అంటూ ఆ సీన్స్ ఓకే చేశారట . తెరపై బ్రహ్మానందం - తారక్ కామెడీ సినిమాలో ఎంత హైలెట్గా పండిందో మనకు తెలిసిందే . ఇప్పటికీ ఈ సినిమా టీవీలో చూసిన జనాలు కడుపు చెక్కలు అయ్యే విధంగా నవ్వుకుంటారు...!