ప్రస్తుతం సోషల్ మీడియాలో, మెయిన్ మీడియాలో ఎక్కడ చూసిన నయనతార ధనుష్ వివాదమే కనిపిస్తోంది.. ప్రముఖ ఓటిటి సంస్థ అయినటువంటి నెట్ ఫ్లిక్స్ నవంబర్ 18వ తేదీన ఆమె పుట్టినరోజు సందర్భంగా ఆమె లైఫ్ కు సంబంధించినటువంటి ఒక డాక్యుమెంటరీని రూపొందించుకుంది.. అయితే దీనికి సంబంధించిన ట్రైలర్ ముందుగా విడుదల అవ్వగా అందులో కేవలం మూడు సెకండ్ల నిడివి ఉన్న ఒక వీడియో క్లిప్ జత చేసింది. ఆ వీడియో ధనుష్ కు సంబంధించినటువంటి వీడియో.. దీంతో కోపానికి వచ్చిన ధనుష్ తన పర్మిషన్ లేకుండా ఈ క్లిప్ ఇలా పెట్టారని నయనతారపై 10 కోట్ల డిమాండ్ చేస్తూ లీగల్ నోటీసులు పంపారు.. ఇక అక్కడ మొదలైన వివాదం  పలు రకాలుగా  ముందుకు వెళ్తోంది..

 అయితే దీనిపై తీవ్రంగా కోపానికి వచ్చిన నయనతార మీరు ఇండస్ట్రీకి కుటుంబ సభ్యుల సపోర్ట్ తో వచ్చారు, నేను సొంత కాళ్లపై ఎదిగాను అంటూ ఒక బహిరంగ లేఖను వదిలింది..ఈ వివాదంపై తాజాగా  ధనుష్ తండ్రి కస్తూరి రాజా స్పందించారు. ఈ సందర్భంగా ఆయన "మాకు పని ముఖ్యం..అందుకే మేము ముందుకు వెళ్తున్నాం.. వెన్నుపోటు పొడిచే వారికి సమాధానం చెప్పే టైం మాకు అంతకంటే లేదు.. అలాగే నా కొడుకు దృష్టి కూడా  ఆ పని పైనే ఉంటుందని తెలియజేశారు..

ప్రస్తుతం ఆయన చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.. వెన్నుపోటు అనే పెద్ద మాట మాట్లాడుతున్నారు,  అసలు ధనుష్ నయనతార మధ్య ఇంకేదో వివాదం ఉంది.ఈ విషయాన్ని పక్కన పెట్టి ఉట్టి విషయాన్ని పట్టుకొని నానా హంగామా చేస్తున్నారు. అందుకే కస్తూరి రాజా వెన్నుపోటు అనే మాట మాట్లాడారు.. వీరి మధ్య అసలు విషయం ఏంటనేది  వెతికే ప్రయత్నాలు చేస్తున్నారు నేటీజన్లు..చూడాలి ఈ వివాదం ఎటు నుంచి ఎటు దారితీస్తుంది అనేది ముందు ముందు తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: