సుకుమార్ దర్శకత్వంలో టాలీవుడ్ లో స్టైలిష్ స్టార్ గా కొనసాగిన స్టార్ హీరో అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన పుష్ప సినిమా ఎంతటి బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. గంధపు చెక్కల స్మగ్లింగ్ అనే కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమా ఇండియన్ బాక్సాఫీస్ ను షేక్ చేసింది పాన్ ఇండియా రేంజ్ లో హిట్ అయింది. ఇక ఈ సినిమాతో అల్లు అర్జున్ రేంజ్ మారిపోయింది. దీంతో అప్పటివరకు టాలీవుడ్ లో స్టైలిష్ స్టార్ గా కొనసాగిన అల్లు అర్జున్ కాస్త ఐకానిక్ స్టార్ గా మారిపోయాడు. ఈ హిట్ తో సుకుమార్ కూడా పాన్ ఇండియా రేంజ్ దర్శకుడిగా గుర్తింపును సంపాదించుకున్నాడు అన్న విషయం తెలిసిందే.


 అయితే ఇక పుష్ప సినిమాకు సీక్వల్ గా పుష్ప-2 తిరకేక్కింది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ పూర్తికాగా.. అటు డిసెంబర్ 5వ తేదీన విడుదల కాబోతుంది. ఇప్పటికే చిత్రంలో ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ లో బిజీబిజీగా ఉంది అన్న విషయం తెలిసిందే. అయితే ఇక ఈ భారీ బడ్జెట్ సినిమాకి అల్లు అర్జున్ రెమ్యూనరేషన్ ఎంత తీసుకున్నాడు అన్న విషయం హాట్ టాపిక్ గా మారిపోయింది. కొన్నాళ్లపాటుఈ సినిమా కోసం అల్లు అర్జున్ 150 కోట్ల రూపాయల పారితోషకం తీసుకున్నాడు అంటూ ఒక వార్త వైరల్ గా మారింది. ఇటీవల ఏకంగా పుష్ప-2 కోసం 200 కోట్లు అటు అల్లు అర్జున్ పుచ్చుకున్నాడు అని మరో న్యూస్ తెర మీదకు వచ్చింది.


 అయితే అటు అల్లు అర్జున్ మాత్రమే కాదు హీరోయిన్గా నటించిన రష్మిక మందన్న కూడా రెమ్యూనరేషన్ విషయంలో తగ్గలేదట. ఏకంగా ఒక్కో సినిమాకి మూడు నుంచి నాలుగు కోట్ల పారితోషకం తీసుకునే రష్మిక మందన్న పుష్ప-2 కోసం ఏకంగా 10 కోట్ల పారితోషకం అందుకుందట. కథ ఈ సినిమాలో శ్రీవల్లి పాత్రలో..అల్లు అర్జున్ భార్యగా నటించింది రష్మిక మందన్న. పుష్ప సినిమా పాన్ ఇండియా రేంజ్ లో హిట్ కావడంతో రష్మిక క్రేజ్ కూడా ఒక్కసారిగా పెరిగిపోయింది అన్న విషయం తెలిసిందే.అయితే సౌత్ లో ఏ హీరోయిన్ కి సాధ్యం కాని రీతిలో  ఇలా రష్మిక ఒక్క సినిమాకి 10 కోట్లు తీసుకుంది అన్న వార్త బయటకు రావడంతో అందరూ షాక్ లో మునిగిపోతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: