భార్యాభర్తలు అర్థం చేసుకోవడానికి ఎంత టైం కావాలి .. కొంతమంది ఇట్టే కలిసిపోతారు. మరికొన్ని జంటలు పిల్లలు పుట్టిన తర్వాత మరింత ప్రేమగా ఉంటారు. మరికొందరు ఐదేళ్ల కు .. మరికొందరు 10 ఏళ్లకు సెట్ అవుతారు. మరికొందరు దశాబ్దాలు కాపురం చేసి పిల్లల పుట్టి.. పిల్లలు పెద్ద వాళ్ళు అయ్యి .. పిల్లలకు పెళ్లి అయ్యాక కూడా విడిపోతూ ఉంటారు. అలాంటి వాళ్ళను ఏమనాలి ? అప్పటివరకు వాళ్ళు చేసింది సంసారం కాదా .. వాళ్ళ మధ్య ఉన్న అనుబంధం అంతేనా ? కొన్ని జంటలను చూస్తే ఇలాంటి సందేహాలు కలుగుతాయి. సెలబ్రిటీలుగా ఉంటూ నలుగురికి ఆదర్శంగా ఉండాల్సిన జంటలే అనూహ్యంగా విడిపోతున్నాయి. అదేదో పెళ్లయ్యాక మూడు నాలుగు ఐదు సంవత్సరాలకు విడిపోయారంటే అనుకోవచ్చు.. పోనీ పిల్లలు పుట్టకముందు విడిపోయారు అంటే అర్థం ఉంటుంది .. కానీ ఏళ్లకు వీళ్ళు కాపురం చేసి పిల్లల పుట్టి పెరిగి పెద్దయి మనవళ్లు పుట్టిన తర్వాత కూడా చాలామంది విడాకులు తీసుకుంటున్నారు.
ఇక్కడ ఎవరు వ్యక్తిగత కారణాలు వాళ్లకు ఉంటాయి .. కానీ ఇలా ఏళ్లకు ఏళ్లు కాపురం చేసి విడిపోవడం అనేది ఇటీవల కాలంలో ఎక్కువ అయింది. మరీ ముఖ్యంగా సినిమా సెలబ్రిటీల విషయంలో ఇది ఎక్కువగా జరుగుతోంది. సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ తన భార్య సైరాభాను నుంచి విడిపోయిన అనే ప్రకటించినప్పటి నుంచి ఈ చర్చ మరింత ఎక్కువవుతుంది. ఎందుకంటే వీరి దాంపత్య జీవితానికి దాదాపు 30 ఏళ్లు అవుతుంది.. అలాంటి జంట విడాకులు తీసుకోవడం చాలా మందిని ఆశ్చర్యపరిచింది. కేవలం రెహమాన్ దంపతులు మాత్రమే కాదు.. మొన్నటికి మొన్న జయం రవి కూడా ఇదే పని చేశాడు. తన భార్య ఆర్తితో 18 ఏళ్లు కాపురం చేశాడు.. రవి చాలా బహిరంగ వేదికలలో వీళ్ళిద్దరి అన్యోన్యత చూపరులను కట్టిపడేసేది. చూడముచ్చటైన అనే జంట అన్న పేరు కూడా ఉంది. 18 ఏళ్ళు భార్యాభర్తలుగా ఉండి ఒక్కసారిగా విడిపోయారు.
ఇక హీరో ధనుష్ - రజిని కుమార్తె ఐశ్వర్య కూడా 18 ఏళ్లు కాపురం చేసి తెగతెంపులు చేసుకున్నారు. వీళ్ళిద్దరూ సెలబ్రిటీ కపుల్ ఇక మరో సంగతి దర్శకుడు జీవి ప్రకాష్ కూడా తన భార్యకు విడాకులు ఇచ్చేసాడు. సైంధవిని ప్రేమించి పెళ్లి చేసుకుని 11 ఏళ్లు కాపురం చేశారు. ఇద్దరు ఏమైందో కానీ సడన్గా విడిపోయారు. ఇలా చెప్పుకుంటూ పోతే దశాబ్ద కాలానికి పైగా కాపురం చేసి.. విడిపోయిన జంటలు చాలా కనిపిస్తాయి. సానియా మీర్జా - షోయబ్ మాలిక్ 13 ఏళ్లు కాపురం చేసి విడిపోయారు. ఆర్భాజ్ ఖాన్ - మలైకా అరోరా 20 ఏళ్లు కాపురం చేసి విడిపోయారు. ఇక 10 ఏళ్లకు పైగా కాపురం చేసి ఫర్హాన్ తన భార్యతో విడిపోతే .. హృతిక్ రోషన్ కూడా 14 ఏళ్ళు వైవాహిక బంధంలో ఉండి సుసానే ఖాన్‌కు విడాకులు ఇచ్చేశాడు. సైఫ్ ఆలీఖాన్ అమృత సింగ్ తో 13 ఏళ్లు కాపురం చేసి విడాకులు ఇచ్చేశాడు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మంది ఈ లిస్టులోకి వస్తారు.