రష్మిక మందన్నా బాలీవుడ్ ఇండస్ట్రీలో క్రేజీ హీరోయిన్ . ఆమె చేతిలో ఆరు బడా ప్రాజెక్ట్స్ ఉన్నాయి . తెలుగులోనూ పలు సినిమాలో నటిస్తుంది . అంతేకాకుండా మూడు సినిమాలను హోల్డ్ లో పెట్టుకొని ఉంది. ఆ సినిమాలో ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయిపోయాయి అన్న వార్తలు వినిపిస్తున్న.. ఎక్కడ దానిపై అఫీషియల్ ప్రకటన లేదు . అయితే తాజాగా సోషల్ మీడియాలో ఒక వార్త ట్రెండ్ అవుతుంది . సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో తెరకెక్కబోయే ప్రభాస్ హీరోగా కనిపించబోయే "స్పిరిట్" సినిమాలో హీరోయిన్గా రష్మిక మందన్నా సెలెక్ట్ అయింది అంటూ చాలా రకాలుగా వార్తలు వినిపించాయి. ఆల్రెడీ అనిమల్ సినిమాతో రష్మిక మందన్నాన్ను బాగా వాడేసాడు సందీప్ రెడ్డివంగా. మరొకసారి పుష్ప 2 హిట్ అయ్యాక ఆమె క్రేజ్ పెరిగిపోతుంది అన్న ప్రయత్నం గానే సందీప్ రెడ్డివంగా స్పీరిట్ సినిమా కోసం రష్మిక మందన్నాను చూస్ చేసుకున్నాడు అంటూ వార్తలు బాగా వినిపించాయి.
ఈ వార్తల పై సందీప్ ఇటు రష్మిక మందన్నా రియాక్ట్ కాకపోవడంతో అంతా ఇది నిజమే అనుకున్నారు. కానీ తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న న్యూస్ ప్రకారం ఈ సినిమాలో హాట్ హీరోయిన్ సౌత్ ఇండియా క్రెజియస్ట్ బ్యూటీ నయనతారను చూస్ చూసుకున్నారట మేకర్స్ అంటూ ప్రచారం జరుగుతుంది. అంతేకాదు ఈ సినిమాలో అలియా భట్ కూడా మరొక కీలకపాత్రలో కనిపించబోతుందట . ప్రజెంట్ ఇదే న్యూస్ సినిమా ఇండస్ట్రీలో బాగా ట్రెండ్ అవుతూ వైరల్ గా మారింది. అయితే రష్మిక మందన్నా ని ఈ ప్రాజెక్ట్ నుంచి తీసేసినట్లేగా అంటూ జనాలు ఓ క్లారిటీకి వచ్చేస్తున్నారు . ఎందుకు తీసేసారు అన్నది మాత్రం ఇంకా ప్రశ్నార్థకంగానే ఉంది . బ్యాక్ టు బ్యాక్ సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో రష్మిక మందన్నా కనిపిస్తే ఆయన ఇమేజ్ కి డ్యామేజ్ అవుతుందన్న కారణంగానే ఇలా చేశాడేమో అనుకుంటున్నారు అభిమానులు. చూడాలి మరి దీనిపై అఫీషియల్ ప్రకటన ఎప్పుడు వస్తుందో...??