టాలీవుడ్ లో ఇద్దరు భార్యల మధ్య నలిగిపోయే భర్తల కథలతో ఎన్నో సినిమాలు వచ్చాయి.90'స్ లో అలాంటి కథలకు మంచి ప్రేక్షకాదరణ లభించింది.ఫ్యామిలీ ఆడియన్స్ అంతా ఆ సినిమాలు చూడటానికి థియేటర్స్ కి క్యూ కట్టేవారు.అయితే అప్పట్లో బాగా పాపులర్ అయిన ఈ ట్రెండ్ ఇప్పటికి కొనసాగుతుంది.ప్రస్తుతం స్టార్ హీరోలు సైతం అలాంటి  ఫ్యామిలీ కథలకు ఓకే చెబుతున్నారు.కుటుంబం అంతా కలిసి చూసే   ఓ చక్కటి ఫ్యామిలీ ఎంటెర్టైనెర్ కోసం ఎదురుచూసే ప్రేక్షకులకు ఇలాంటి సినిమాలు మంచి అనుభూతిని కలిగిస్తాయి.ఈ తరహా కథలను ప్రెజెంట్ జనరేషన్ స్టార్ హీరో అయిన ఎన్టీఆర్ సైతం ట్రై చేసాడు.ఎన్టీఆర్ నటించిన బిగ్గెస్ట్ కుటుంబకథా చిత్రం "బృందావనం"..గతంలో ఎన్టీఆర్ వరుస మాస్ సినిమాలలో నటించి మెప్పించాడు.ఎన్టీఆర్ ని మంచి కుటుంబకథా చిత్రంలో  చూడాలని ఫ్యాన్స్ ఎంతగానో కోరుకున్నారు.ఫ్యాన్స్ కోరిక మేరకు ఎన్టీఆర్ నటించిన అద్భుత చిత్రం "బృందావనం"..

ఈ సినిమాలో రెండు ఊర్లను శాసించే ఇద్దరు అన్నదమ్ములను కలిపే పాత్రలో ఎన్టీఆర్ అద్భుతంగా నటించాడు.ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన స్టార్ హీరోయిన్స్ అయిన కాజల్ ,సమంత హీరోయిన్స్ గా నటించారు.వంశీపైడిపల్లి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాను స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మించారు..అక్టోబర్ 14 2010 లో వచ్చిన ఈ సినిమా ఎన్టీఆర్ కెరీర్ లో ఎప్పటికీ నిలిచిపోయే చిత్రం అయింది.ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్స్ మధ్య నలిగిపోయే హీరోగా తారక్ అద్భుతంగా నటించాడు.ఆ ఇద్దరి మధ్య ఈ గోవిందుడు బుక్కయ్యాడు.. అనే ట్యాగ్ లైన్ తో కథను మేకర్స్ ముగించడంతో కథ సుఖాంతం అవుతుంది..ఈ సినిమాలో ఎన్టీఆర్ ని దర్శకుడు వంశీ పైడిపల్లి కొత్తగా చూపించాడు.ఎంత కుటుంబ కథా చిత్రం అయినా కూడా ఎన్టీఆర్ ఫ్యాన్స్ ని మెప్పించేందుకు దర్శకుడు వంశీ పైడిపల్లి మాస్ డైలాగ్స్ తో పాటు పవర్ ఫుల్ ఫైట్స్ ని కూడా జత చేసి ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి  విందు భోజనం తినిపించాడు.ఈ సినిమాకు అప్పట్లో మంచి ప్రేక్షకాదరణ లభించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: